కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో తాజాగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627కు చేరింది. నమోదైన మొత్తం కేసులలో చికిత్స అనంతరం కరోనా బారి నుంచి 1807 మంది కోలుకుని డిశ్ఛార్జ్ కాగా, 56 మంది మరణించారు.
ఏపీలో ప్రస్తుతం 764 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,357 శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయగా 66 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుని 29 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. నగ్న వీడియోలతో బెదిరింపులు.. వివాహిత ఆత్మహత్య
17 New Positive cases are Foreign Returnees (12 from Kuwait, 3 from Dubai(SA) and 2 from Qatar)#APfightsCorona
— ArogyaAndhra (@ArogyaAndhra) May 24, 2020
విదేశాల నుంచి వచ్చిన వారిలో 17 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కువైట్ 12, దుబాయ్ 3, ఖతర్ నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కోవిడ్19 టెస్టులు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఏపీలో కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..