అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కృష్టంరాజు

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కృష్టంరాజు

Updated: Nov 14, 2019, 10:35 AM IST
అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కృష్టంరాజు
File photo

హైదరాబాద్: సీనియర్‌ రెబల్ స్టార్, కేంద్ర మాజీ సహాయ మంత్రి కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. గత నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న కృష్ణంరాజును ఆయన కుటుంబసభ్యులు బుధవారం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నట్టు ధృవీకరించిన వైద్యులు.. ఐసియూలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.