CM Jagan Review: ఏపీలో ఇక బైజూస్‌ చదువులు..సీఎం జగన్ సమక్షంలో కీలక ఒప్పందాలు..!

CM Jagan Review: విద్యా శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మన బడి నాడు-నేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్‌ మీడియం తదితర అంశాలపై అధికారులపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కీలక ఒప్పందాలు కుదిరాయి.

Written by - Alla Swamy | Last Updated : Jun 16, 2022, 05:38 PM IST
  • విద్యా శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
  • అధికారులకు దిశానిర్దేశం
  • నాణ్యమైన విద్యపై కీలక ఒప్పందం
CM Jagan Review: ఏపీలో ఇక బైజూస్‌ చదువులు..సీఎం జగన్ సమక్షంలో కీలక ఒప్పందాలు..!

CM Jagan Review: నాణ్యమైన విద్య అందించే దిశగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను సన్నద్ధం చేసేందుకు విద్యా రంగంలో మరో కార్యక్రమం చేపట్టనున్నారు. ఈక్రమంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌తో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో ప్రభుత్వం, బైజూస్ ప్రతినిధులు సంతకాలు చేశారు.

కొందరికే పరిమితమైన ఎడ్యు-టెక్..ఇక ప్రభుత్వ స్కూళ్లల్లో పేదల పిల్లలకు అందుబాటులోకి రానుంది. ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.24 వేలు పైబడి చెల్లిస్తే కాని లభించిన బైజూస్..ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా లభించనుంది. తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంల్లో సమగ్రంగా నేర్చుకునే వీలు ఉంది. ఇవాళ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు అని సీఎం జగన్ అన్నారు. 2025లో సీబీఎస్‌ఈ నమూనాలో పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు మరో అడుగు వేశామని స్పష్టం చేశారు.

విద్యార్థులకు సిలబస్‌ అందించడంతోపాటు అదనంగా ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్, నేర్చుకునేందుకు ట్యాబ్‌లు అందిస్తామన్నారు. దాదాపు 4.7 లక్షల మందికి ట్యాబ్‌లు ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ట్యాబ్‌లు అందిస్తామన్నారు. ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ఇవి ఇస్తామని సీఎం జగన్ తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది నుచి బైజూస్‌ కంటెంట్‌కు పొందుపర్చి పాఠ్య పుస్తకాలను ముద్రిస్తామని తెలిపారు.

వీడియో కంటెంట్ ద్వారా పిల్లలు నేర్చుకునేందుకు నాడు-నేడు కింద ప్రతి తరగతి గదిలో టీవీలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం జగన్. యంగ్ స్టార్టప్‌ కన్నా సీఎం వేగంగా అడుగు వేశారని బైజూస్‌ సీఈవో రవీంద్రన్ చెప్పారు. మే 25న తొలి సమావేశం జరిగిందని..ఆ వెంటనే ఒప్పందాలు జరిగిపోయాయన్నారు. ఈసమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బైజూస్ సీఈవో బైజ్ రవీంద్రన్ పాల్గొన్నారు.

Also read:North Korea: ఉత్తర కొరియాలో కొత్త వ్యాధి ముప్పు, పెరుగుతున్న జ్వర బాధితులు

Also read: Congress MP Jyotimani: నా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.. మహిళా ఎంపీ ఆరోపణలు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News