జనసేన వీడి వైసిపిలో చేరిన తర్వాత ఆకుల వ్యాఖ్యలు

జనసేన వీడి వైసిపిలో చేరిన తర్వాత ఆకుల వ్యాఖ్యలు

Updated: Oct 8, 2019, 05:20 PM IST
జనసేన వీడి వైసిపిలో చేరిన తర్వాత ఆకుల వ్యాఖ్యలు
Twitter photo

అమరావతి: జనసేన నేత ఆకుల సత్యనారాయణ ఊహించినట్టుగానే ఇవాళ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్న అనంతరం ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. జగన్ పరిపాలన, ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు నచ్చడంతోపాటు అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుకు శ్రీకారం చుట్టిన తీరు నచ్చడం వల్లే తాను ఆ పార్టీలో చేరానని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం హర్షించదగినది అని ఆకుల అన్నారు. ఆకుల సత్యనారాయణతోపాటే టీడీపి నేత, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ కూడా టీడిపిని వీడి వైఎస్సార్సీపీలో చేరారు.

2014 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి బీజేపి తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల సత్యనారాయణ ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆకుల.. తాజాగా ఆ పార్టీని వీడి వైసిపిలో చేరారు.