Ambati Rambabu Crucial Comments on AP Govt GO No.1: తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 1 గురించి ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పంలో జీవో 1ను పాటించడాన్ని తిరస్కరించారని, చంద్రబాబు మాట్లాడిన తీరు పిచ్చి కుక్క అరిచినట్టు ఉందని అన్నారు. చంద్రబాబు చట్టాన్ని ఉల్లంఘించమని చెబుతున్నాడని, జీవో 1 ప్రకారం రోడ్డు మీద బహిరంగ సభలు పెట్టకూడదని అన్నారు. నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే సభలు నిర్వహించాలని పేర్కొన్న అంబటి చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉండదా?? అని ప్రశ్నించారు.
చంద్రబాబు తిరిగితే ఏమవుతుంది?? ఏమయ్యింది?? తిరిగిన తర్వాతేగా 23 స్థానాలకు పరిమితం అయ్యిందని అంబటి ఎద్దేవా చేశారు. అసలు బాబు కుప్పంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలిచావా?? ఎందుకు నా కుప్పం...నా కుప్పం అంటూ రంకెలు వేస్తున్నావని ఆయన ప్రశ్నించారు. ఆ కుప్పంలో ఇల్లు కాదు కదా ఓటు కూడా చంద్రబాబుకు ఎందుకు లేదు?? అని అంబటి ప్రశ్నించారు. ఇక కుప్పానికి రెవెన్యూ డివిజన్ చేసింది జగన్ అని పేర్కొన్న అంబటి చంద్రబాబు ఎక్కడకు వెళితే అక్కడ శని దాపురిస్తుందని అన్నారు. పుష్కరాల్లో ఫోటో షూట్ కోసం 29 మందిని పొట్టన పెట్టుకున్నావని పేర్కొన్న అంబటి అయినా పశ్చాత్తాపం లేదు చంద్రబాబులో లేదన్నారు.
జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేశారు....ఎక్కడైనా జనం చచ్చిపోయారా?? అని అంబటి రాంబాబు స్పందించారు. ఇక ఈ జీవో నెం.1 వైసీపీకి కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో 11 మంది చనిపోతే పెద్ద విషయం కాదా?? అని ప్రశ్నించిన ఆయన కుప్పంలో లాఠీ ఛార్జ్ జరిగి కార్యకర్తలు గాయపడినట్లు డ్రామాలు ఆడి పరామర్శ చేసే కర్మ చంద్రబాబుకు ఎందుకు?? అని ప్రశ్నించారు. ఇక దుప్పట్లు, ఉల్లిపాయ, చింతపండు పంచే కార్యక్రమాలకు హాజరు అయ్యే దీన స్థితిలో చంద్రబాబు ఉన్నాడని ఆయన అన్నారు. ఇక కుప్పంలో చంద్రబాబు పర్యటనలో ఉండగా జీఓ నెంబర్ 1 ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని పోలీసులు జిఓ అమలులో ఉంది అని చెప్పడంతో వారి మీదకు చంద్రబాబు వాగ్వాదానికి దిగడం చాలా దుర్మార్గమని అన్నారు.
ప్రభుత్వం రోడ్ షోలు, బహిరంగ సభలు వద్దని ఎక్కడ చెప్పలేదని పేర్కొన్న అంబటి చంద్రబాబు,దత్త పుత్రుడు కొంత మంది ఎల్లో మీడియా వారు తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు జిఓ ప్రకారంగా ప్రభుత్వం సభలకు ఏది ఐనా కాళీ స్థలాల్లో నిర్వహించుకోవచ్చు అని చెప్పిన మాట చంద్రబాబుకి అర్థం కాదని అన్నారు. ఇక ఆ జిఓకి కారణం చంద్రబాబు సభలు,రోడ్ షోలని ఆయన పేర్కొన్నారు. ప్రధాని పిలిచినా వెళ్ళని చంద్రబాబు దుప్పట్లు పంచుతాను అంటే వెళ్లడం ఏంటి ...? అని అంబటి ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్ని పోరాటాలు చేసిన జిఓ నెంబర్1 ని వెనక్కి తీసుకునే సమస్యే లేదని పేర్కొన్న అంబటి ఎవ్వరైనా సరే జిఓ ప్రకారంగానే అన్ని పర్మిషన్స్ తీసుకుని రోడ్డు షోలు,ర్యాలీలు,సభలు నిర్వహించాలని అన్నారు. ఇక చంద్రబాబు రంకెలకు ,పిచ్చి కుక్క కేకలకి ఎట్టి పరిస్థితుల్లో జివోని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోదని తేటతెల్లం చేశారు.
Also Read: Thalapathy Vijay Divorce: భార్యకు విడాకులివ్వనున్న స్టార్ హీరో విజయ్.. అసలు విషయం ఏమిటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook