YS Sharmila Fire On CM YS Jagan In Bapatla Meeting: ప్రత్యేక హోదా ను మళ్ళీ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా ?.. లేక బీజేపీ తో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ?.. అంటూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా మరోసారి జగన్ పై మండిపడ్డారు. బాపట్ల నియోజక వర్గంలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలా మాట్లాడుతూ... పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి సిద్ధమా ?.. 25 లక్షల ఇండ్లు కడతామని మోసం చేయడానికి సిద్ధమా ?.. రాష్ర్టంలో లిక్కర్,మైనింగ్ మాఫియా కు సిద్ధమా ? అంటూ జగన్ ను కడిగి పడేశారు.
మీరు సిద్ధమైతే... ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంమంటూ సెటైర్ వేశారు. ప్రత్యేక హోదా పై జగన్ అన్న చేతులు ఎత్తేశారు.. బీజేపీ కి పూర్తి మెజారిటీ వస్తుందని, ఏమి చేయలేమని అంటున్నారు. ఏపీకి రాజధాని లేదని, పోలవరం ఇవ్వలేదని.. ఎందుకు ఇన్నాళ్లు అడగలేరని అన్నారు. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటికి మేలు చేయాలని తపన నాలో ఉంది.. అందుకే ఆంధ్ర రాష్ర్టంలో వైఎస్సార్ బిడ్డ అడుగు పెట్టిందన్నారు.
పోలవరం వచ్చేంత వరకు కొట్లాడుతా.. హోదా సాధించే వరకు కొట్లడుతా.. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తే హోదా రాదని షర్మిలా అన్నారు. ఏపీరాష్ట్రంలో బాబు కి ఓటు వేసినా...జగన్ కి ఓటు వేసినా.. పవన్ కి ఓటు వేసినా బీజేపీ కి వేసినట్లే అని షర్మిలా చెప్పారు. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవక పోయినా బీజేపీ రాజ్యమేలుతుంది. ఏపీకి మాత్రం.. హోదా రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం... అధికారంలో వచ్చిన మొదటి రోజే హోదా పై సంతకం పెడతా అని ఇప్పటికే రాహుల్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తలెత్తుకునేలా రాజధాని రావాలంటే కాంగ్రెస్ రావాలి.. పోలవరం పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలని షర్మిలా పేర్కొన్నారు.
మీటింగ్ కు వచ్చేటప్పుడు.. ఒక అన్నని అడిగా.. బాపట్ల ఎలా ఉందని.. వైఎస్సార్ హయాంలో 14 వందల కోట్లతో చేసిన అభివృద్ధి తప్పా ... మరేం లేదు అన్నారు. బాబు చేసిన అభివృద్ధి లేదు.. జగన్ ఆన్న చేసిన అభివృద్ధి ఏమి లేదు అన్నాడు. కనీసం రోడ్లు కూడా వేయలేదట.. ఆరోజు వైఎస్ హయాంలో.. గ్రామాలకు వేసిన రోడ్లు తప్పా కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేయలేదట. తాగడానికి కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితి ఉందంట. ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎంపీలు ఇసుక మాఫియా మీద ప్రేమ తప్పా మరొకటి లేదని ఎద్దేవా చేశారు.
Read More: Morning Show: జిఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ పుస్తక ఆవిష్కరణ…హాజరైన దర్శకులు..
ప్రజలను పట్టించుకొనే తీరిక లేదు.. కెనాల్స్ కట్టలు కట్టే తీరిక లేదు కానీ...ఆ పక్కన ఇసుక దోచుకుంటున్నారు. వైఎస్సార్ గుర్తుతో గెలిచారు. గెలిచాక వైఎస్సార్ ఆశయాలను మరిచారని షర్మిలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం వైఎస్సార్ విగ్రహాన్ని కూడా పెట్టనివ్వడం లేదట.. ఇదేనా వైఎస్సార్ పాలన.. వైఎస్సార్ హయాంలో రైతే రాజు.. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగ.. సబ్సిడీ పథకాలతో రైతును ఆదుకున్నాడు.. పంట నష్టపోతే రెండింతలు పరిహారం ఇచ్చేవాడని గుర్తుచేసింది. ఇప్పుడున్న జగన్ ఆన్న ప్రభుత్వం .. కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వమని వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook