Anaparthy Politics: ఏపీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ మధ్య పొత్తు రాజకీయాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. కూటమి సీట్ల సర్దుబాటు కోసం అభ్యర్ధులు అధికారికంగా పార్టీ మారుతున్నారు. మొన్న అవనిగడ్డ, నిన్న ఉండి..ఇప్పుడు అనపర్తి. కేవలం టికెట్ కోసం పార్టీ అంగీకారంతో మరో పార్టీలో చేరుతున్న విచిత్ర పరిస్థితి నెలకొంది.
కూటమి పొత్తులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకు కేటాయించారు. దాంతో అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని భీష్మించుకుకూర్చున్నారు. కుటుంబంతో సహా రోడ్డెక్కి ప్రచారం ప్రారంభించేశారు. ఈ పరిణామం బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధికే కాకుండా రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి పురంధరేశ్వరి విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయం వెంటాడింది. అలాగని అనపర్తి తెలుగుదేశానికి కేటాయించేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించలేదు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం గెలుపుపై అనపర్తి పాత్ర ప్రతిసారీ కీలకంగా ఉంటుంది. అనపర్తిలో వచ్చిన మెజార్టీతోనే రాజమండ్రి ఎంపీ అభ్యర్ధి విజయం ఆధారపడి ఉంటుంది. అందుకే అటు తెలుగుదేశం ఇటు బీజేపీ మధ్య విచిత్రమైన ఒప్పంద జరిగింది.
ఇందులో భాగంగా అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డినే బీజేపీలో చేర్చుకుని టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించింది. ఈ ప్రతిపాదన నల్లమిల్లికి ఇష్టం లేకున్నా టీడీపీ నేతలే ఒప్పించారు. దాంతో నిన్న అధికారికంగా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు బీజేపీ ముందుగా ప్రకటించిన శివరామకృష్ణంరాజును తప్పించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించనుంది. అంటే ఇప్పుడు టీడీపీ అభ్యర్ధే బీజేపీ నుంచి పోటీ చేయనున్నారన్నమాట.
ఈసారి ఎన్నికల్లో ఇలాంటి పరిణామం కొత్తకాదు. అవనిగడ్డ టికెట్ జనసేనకు కేటాయించగానే అప్పటి వరకూ తెలుగుదేశంలో ఉన్న మండలి బుద్ధప్రసాద్ ఆ పార్టీలో చేరి టికెట్ చేజిక్కించుకున్నారు. అటు బీజేపీలో నర్శాపురం టికెట్ ఆశించి భంగపడిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలుగుదేశంలో చేరి ఉండి టికెట్ తెచ్చుకున్నారు. ఏపీలో కేవలం టికెట్ కోసం పార్టీల మధ్య పరస్పర అభ్యర్ధుల మార్పిడి జరుగుతుండటం వింతగా ఉంది.
Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విద్యార్ఙతపై స్పష్టత, చదివింది పదో తరగతేనట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook