జిల్లాల వారీగా ఈసి బయటపెట్టిన నకిలీ ఓట్ల లెక్కలు ఇవి

జిల్లాల వారీగా నకిలీ ఓట్ల లెక్కలు బయటపెట్టిన ఈసి

Last Updated : Mar 23, 2019, 05:25 PM IST
జిల్లాల వారీగా ఈసి బయటపెట్టిన నకిలీ ఓట్ల లెక్కలు ఇవి

అమరావతి: నకిలీ ఓట్ల ఏరివేతను దాదాపు పూర్తిచేసిన ఏపీ ఎన్నికల సంఘం అధికారులు తాజాగా ఆయా గణాంకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఏపీలో దాఖలైన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని ఎన్నికల సంఘం అధికారులు తేల్చిచెప్పారు. నకిలీ ఓట్ల నమోదులో 35,063 నకిలీ ఓట్లతో గుంటూరు, 24,190 ఓట్లతో తూర్పుగోదావరి, 19,774 నకిలీ ఓట్లతో కృష్ణా జిల్లాలు అగ్రస్థానంలో  ఉన్నాయని అధికారులు స్పష్టంచేశారు. ఓట్లను తొలగించాల్సిందిగా 9.5 లక్షల దరఖాస్తులు అందగా.. అందులో 1.41 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొలగించినట్టు ఈసీ వెల్లడించింది. 

ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. జిల్లాలవారీగా వెలుగుచూసిన నకిలీ ఓట్ల సంఖ్య ఇలా వుంది. గుంటూరు- 35,063, తూర్పు గోదావరి జిల్లా- 24,190, కృష్ణా- 19,774, చిత్తూరు- 14,052, పశ్చిమగోదావరి 8,669, ప్రకాశం- 6,040, కడప- 5,292, విజయనగరం- 5,166, నెల్లూరు- 3,850, శ్రీకాకుళం- 2,579, విశాఖ- 2,407  నకిలీ ఓట్లు నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు స్పష్టంచేశారు.

Trending News