CM Jagan: పరవళ్లు తొక్కుతున్న గోదావరి..ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే..!

CM Jagan: గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇన్‌ఫ్లో పెరగడంతో దిగువకు నీటిని వదులుతున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 15, 2022, 06:23 PM IST
  • గోదావరి ఉగ్రరూపం
  • ప్రాజెక్టులకు జలకళ
  • సీఎం జగన్ ఏరియల్ సర్వే
CM Jagan: పరవళ్లు తొక్కుతున్న గోదావరి..ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే..!

CM Jagan: గోదావరిలో ఉధృతి క్రమేపి పెరుగుతోంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. పోలవరం, ధవళేశ్వరం, లంక గ్రామాలను పరిశీలించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక శిబిరాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. మరోవైపు గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది.

గంట గంటకు ప్రవాహం రెట్టింపు అవుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70.30 అడుగులకు చేరింది. ఆ ప్రవాహం ధవళేశ్వరం చేరేందుకు మరో 20 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. వరద నీటి ప్రవాహం 25 లక్షల క్యూసెక్కులుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Also read:MP Arvid: ఎంపీ అర్వింద్‌పై మరోసారి దాడి..ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా ఆరా..!

Also read:Bhadrachalam Godavari Floods LIVE*: భద్రాచలం వద్ద గోదావరి డేంజర్ బెల్స్.. ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News