Ys jagan on Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరువాత తానిక విశాఖపట్నంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈసారి విశాఖపట్నం నుంచే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. విశాఖపట్నం అభివృద్ధిపై తనకు పదేళ్ల ప్రణాళిక ఉందన్నారు.
ప్రముఖ వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులతో ఏపీ డెవలప్ మెంట్ డైలాగ్ పేరుతో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సులో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం గురించి, రాజధాని అంశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సహా ఏ ప్రాంతానికి తాను వ్యతిరేకం కానందునే అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించామని వైఎస్ జగన్ తెలిపారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తున్నాట్టు చెప్పారు. ఎన్నికల అనంతరం తాను విశాఖలోనే ఉంటానన్నారు. ఈసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నంలోనే చేస్తానని చెప్పారు.
విశాఖపట్నం అభివృద్ధి విషయంలో తనకు పదేళ్ల విజన్ ఉందన్నారు. చెన్నై, హైదరాబాద్ నగరాలకు దీటుగా విశాఖపట్నం తయారుకానుందన్నారు. విశాఖపట్నం అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం అవసరముందన్నారు. విజన్ విశాఖ పేరుతో 28 పేజీల బుక్లెట్ విడుదల చేశారు. అమరావతిలో రాజధాని నిర్మించాలంటే లక్ష కోట్లు అవసరమౌతుందన్నారు. రానున్న 20 ఏళ్లలో ఈ ఖర్చు 10-14 లక్షల కోట్లు కాగలదన్నారు. కానీ విశాఖపట్నం నగరానికి కాస్త మెరుగులు దిద్దితే చాలు మంచి రాజధాని అవుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా నిర్మితమౌతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్ చెప్పారు. భోగాపురానికి ఆరు వరుసల బీచ్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖపట్నంలో ఐకానిక్ సచివాలయం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందన్నారు.
Also read: YCP Election Manifesto: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం, ప్రతిపక్షాల్ని కలవరపెట్టే అస్త్రాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook