AP Common Capital: ఏపీ హైకోర్టుకు చేరిన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంశం

AP Common Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశం మరోసారి తెరపైకి వస్తోంది. మొన్న వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు న్యాయస్థానాన్ని చేరాయి. పూర్తి  వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2024, 12:29 PM IST
AP Common Capital: ఏపీ హైకోర్టుకు చేరిన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంశం

AP Common Capital: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తవుతోంది. అదే సమయంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు కూడా మరో నాలుగు నెలల్లో పూర్తి కానుంది. ఏపీ రాజధాని అంశం అమరావతి వర్సెస్ మూడు రాజధానుల మధ్య పెండింగులో పడింది. ఈ క్రమంలో హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు కొనసాగించాలనే వాదన బలపడుతోంది. ఉమ్మడి రాజధాని అంశంలో తెరవెనుక ఏదో భారీ వ్యూహాలే సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. 

2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేర్చారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం గడువు ఉండగానే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసుకుంటామంటూ వదిలి వచ్చేసింది. 33 వేల ఎకరాలు సేకరించి 2-3 తాత్కాలిక కట్టడాలు నిర్మించి చేతులు దులుపుకుంది. ఆ తరువాత 2019లో అధికారంలో వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానులంటూ కొత్త అంశాన్ని తెరపై తీసుకొచ్చింది. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, లెజిస్టేటివ్ రాజదానిగా అమరావతి, జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు ఎంపిక చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో రాజధానికి భూములిచ్చిన రైతుల్నించి, ప్రతిపక్షం తెలుగుదేశం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉంది. 

ఈలోగా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పార్టీలోని ఇతర నేతలు ఈ వ్యాఖ్యల్ని అతని వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించినా..తెరవెనుక ఏదో జరుగుతోందనే చర్చ మొదలైంది. పార్టీ ప్రమేయం లేకుండా చేసిన వ్యాఖ్యలు కావని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇదే అంశంపై ఓ వ్యక్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం వ్యవహారానికి బలం చేకూరుతోంది. 

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రజా సంక్షేమ సంఘం కార్యదర్శి పి అనిల్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం ప్రకారం హైదరాబాద్‌ను మరో పదేళ్లు రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పిటీషనర్ కోరారు. జూన్ 2వ తేదీ 2024తో హైదరాబాద్ ఉమ్మడి రాజదాని గడువు పూర్తవుతోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల ఆస్థులు, అప్పులు, 9వ షెడ్యూల్ కంపెనీలు, కార్పొరేషన్ల మధ్య ఆస్థుల విభజన ఇంకా పూర్తి కాలేదని పిటీషనర్ తెలిపాడు. అందుకే 2034 జూన్ 2 వరకూ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపేలా ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించాలన్నారు. 

అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడంతో పదేళ్లయినా ఏపీ రాజధాని లేకుండా మిగిలిపోయిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, అంగీకారం, ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆస్థుల విభజన వివాదాలు సమసిపోలేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం కూడా దృష్టి పెట్టకపోడవంతో పలు వివాదాలు న్యాయస్థానాలకు చేరుతున్నాయన్నారు. విభజన హామీలు అమలు కాకపోవడంతో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కోరే హక్కు ఏపీకు ఉంటుందన్నారు. 

Also read: IPL 2024: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ఖాయమేనా, ప్యాట్ కమిన్స్ దశ మార్చనున్నాడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News