ఏపీ అధికారిక చిహ్నంలో స్వల్ప మార్పులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి జరుగుతున్న తప్పును సవరించుకుంది.

Last Updated : Aug 17, 2018, 03:43 PM IST
ఏపీ అధికారిక చిహ్నంలో స్వల్ప మార్పులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి జరుగుతున్న తప్పును సవరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నం 'పూర్ణకుంభం' కాదని, 'పూర్ణఘటం' అని అధికారులు వెల్లడించారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌గా అవతరించినప్పుడు ఉన్న అసలు సిసలైన అధికార చిహ్నాన్ని తిరిగి తెరపైకి తీసుకొచ్చారు.

రాష్ట్ర అధికారిక చిహ్నంపై కొందరు ప్రముఖులు లోతుగా అధ్యనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయగా.. ప్రభుత్వం పురావస్తు, చారిత్రక నిపుణులతో చర్చించి.. 1954 నాటి నోటిఫికేషన్‌ ప్రకారం, ఈ చిహ్నం ఆవిష్కరించినపుడు అందులో ఉన్నది 'పూర్ణఘటం' అని తిరిగి అధికారిక చిహ్నంలో చేర్చాలని నిర్ణయించింది. దీని ప్రకారం... ధర్మచక్రంలో 64 గీతలు, పూర్ణఘటం చిత్రాన్ని చేర్చారు. నాలుగు సింహాల బొమ్మను అలాగే ఉంచారు. ఈ స్వాతంత్ర వేడుకల నుండి పూర్ణఘటం చిహ్నాన్ని అధికారికంగా చేసుకుంది ఏపీ ప్రభుత్వం. దీంతో పాటు అధికార చిహ్నం పైభాగాన ఆంగ్లంలో ఉండే ‘గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ వ్యాఖ్యలను కూడా ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని తెలుగులోకి మార్చారు. ఆంగ్లంలో కిందివైపు ముద్రించారు. సత్యమేవ జయతే అన్న సూక్తిని కూడా తెలుగులోకి మార్చి ముద్రించారు.

ఏపీ అధికారిక చిహ్నంలో స్వల్ప మార్పులు

Trending News