కరోనా ఎఫెక్ట్: ఏపీలో జీతాలు వాయిదా

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వానికి నిధులు ఎక్కువగా అవసరం  పడుతున్నాయి.

Last Updated : Apr 1, 2020, 09:20 AM IST
కరోనా ఎఫెక్ట్: ఏపీలో జీతాలు వాయిదా

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వానికి నిధులు ఎక్కువగా అవసరం  పడుతున్నాయి.

ముఖ్యంగా శానిటేషన్, వైద్య ఖర్చులు, పోలీసు ఖర్చులు .. ఇలా  చాలా వ్యయాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక  నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల  జీత భత్యాలను ఈ నెలకు ఇవ్వడం లేదు.  జీత భత్యాలు చెల్లింపును వాయిదా వేసింది.  దీనికి సంబంధించిన జీవోను ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి జారీ చేశారు. మొత్తంగా 100 శాతం జీత భత్యాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. 

ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలతోపాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు.. ఇలా అందరి  జీతభత్యాల చెల్లింపు నిలిపివేశారు. 'కరోనా వైరస్'ను ధీటుగా ఎదుర్కునేందుకు విధించిన లాక్ డౌన్ పూర్తయిన తర్వాత  జీత భత్యాలు చెల్లించే అవకాశం ఉంది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News