Ayodhya Ram Lalla: అయోధ్య రాముడి ప్రతిష్టాపన చూపిస్తూ.. బ్రెయిన్ సర్జరీ..

Andhra Pradesh: రోగి రాముడి భక్తుడు కావడంతో బెడ్ మీదనే అయోధ్య రామాలయ ప్రతిష్టాపన   వేడుకను చూపిస్తూ, సర్జరీ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 21, 2024, 01:37 PM IST
  • - రాముడి ప్రతిష్టాపన చూపిస్తు ఓపెన్ బ్రైన్ సర్జరీ..
    - డాక్టర్ల రూపంలో రాముడు సర్జరీ చేశారన్న రోగి బంధువులు..
Ayodhya Ram Lalla: అయోధ్య రాముడి ప్రతిష్టాపన చూపిస్తూ.. బ్రెయిన్ సర్జరీ..

Guntur Doctors Perform Brin Surgery: సాధారణంగా కొన్ని క్రిటికల్ సర్జరీలలో డాక్టర్లు మెళకువగా ఉన్నప్పుడే ఆపరేషన్ లు చేస్తున్నారు. కొందరికి తమ అభిమాన హీరోలు లేదా ప్రొగ్రామ్ లు చూపిస్తు సర్జరీలు చేశారు. ఇప్పటికే ఇలాంటి అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్నిరోజులకు ముందే మహేష్ బాబు నటించి పోకిరీ సినిమా చూపిస్తూ ఒక వ్యక్తికి ఆపరేషన్ చేశారు. తాజాగా, ఇలాంటి కోవకు చెందిన మరో ఘటన వార్తలలో నిలిచింది. 

Read More: Tamannaah: హాట్ ఫోటోషూట్‌తో సెగ‌లు పుట్టిస్తోన్న త‌మ‌న్నా.. మిల్కీ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ వైర‌ల్..

వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్యరామమందిరంలో రామ్ లల్లా విగ్రహ స్థాపన కన్నుల పండుగగా జరిగింది. కులమతాలకు అతీతంగా ఎందరో వచ్చి రామ్ లల్లాను కన్నులారా దర్శించుకుంటున్నారు. ఇప్పటికి కూడా భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు చేరుకుంటున్నారు. తమ రాముడిని కన్నులారా చూసుకొని తరించాలని భక్తులు పరితపిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అయోధ్య వరకు వెళ్లలేని భక్తులు కొందరు.. టీవీలలో  లైవ్ ప్రసారం చూస్తు సంబరపడ్డారు. ఇదిలా ఉండగా..  గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన మణికంఠ అనే వ్యక్తికి బ్రైన్ లో కణితి ఏర్పడింది. ఈ క్రమంలో కొన్ని నెలలుగా అతను తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

అతడిని, వైద్యం కోసం కుటుంబ సభ్యులు శ్రీసాయి ఆస్పత్రికి తీసుకెళ్లారు అక్కడ ఇతడిని టెస్ట్ చేసిన వైద్యులు బ్రేయిన్ ట్యూమర్ చికిత్స చేసే సమయంలో కాళ్లు, చెతులు చచ్చుబడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సర్జరీ మెళకువగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలని చెప్పి సర్జీరీ ప్రారంభించారు.

Read More: Priyamani: డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకుంటారు.. బాలీవుడ్ చీప్ ట్రిక్స్ బయటపెట్టిన ప్రియమణి

ఇలా ఫిబ్రవరి 11 న సర్జరీని పూర్తి చేశారు. అయితే.. మణికంఠ రాముడి భక్తుడు కావడంతో, అయోధ్యలోని రాముడి ప్రతిష్టాపన కార్యక్రమం ల్యాప్ టాప్ లో చూపిస్తు సర్జరీని పూర్తి చేశారు. ప్రస్తుతం రోగి కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించారు. డాక్టర్లకు రోగి బంధువలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆ రాముడి రూపంలో వైద్యులే ఇలా శస్త్ర చికిత్స చేశారని, మణికంఠ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x