Priyamani: డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకుంటారు.. బాలీవుడ్ చీప్ ట్రిక్స్ బయటపెట్టిన ప్రియమణి

Bollywood Paparazzi Culture: టాలీవుడ్ తో పోల్చుకుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. పాపారాజి అనే పదానికి.. బాలీవుడ్ స్టార్స్ కి.. ఏదో ఒక అవినాభావ సంబంధం ఉంది అని బాలీవుడ్ కల్చర్ చూస్తేనే అర్థమవుతుంది. కాగా బాలీవుడ్ సెలబ్రిటీలకు..పాపారాజిలకు మధ్య ఉన్న డార్క్ సీక్రెట్ ను బయటపెట్టింది ప్రియమణి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2024, 06:41 PM IST
Priyamani: డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకుంటారు.. బాలీవుడ్ చీప్ ట్రిక్స్ బయటపెట్టిన ప్రియమణి

Bollywood stars: తెలుగు సినిమాలతో తన సినీ కెరీర్ ను మొదలుపెట్టింది ప్రియమణి. 2003లో ఎవరే అతగాడు మూవీతో ఆమె హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళ్, హిందీలో కూడా కొన్ని చిత్రాలు చేసింది. షారుక్ ఖాన్, దీపికా కాంబో లో వచిన్న చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో స్పెషల్ సాంగ్ కి డాన్స్ చేసిన ప్రియమణి.. బాలీవుడ్ ఆడియన్స్ మనసు సైతం దోచుకుంది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన జవాన్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించి హిందీ ఆడియన్స్ కు మరింత దగ్గర అయింది.

జవాన్ మూవీ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రియమణి బాలీవుడ్ తారల పబ్లిసిటీ స్టంట్ కు సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. పబ్లిసిటీ కోసం బాలీవుడ్ స్టార్స్ చేసే చీప్ ట్రిక్స్ గురించి తనకు తెలిసాయి అంటూ ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో అంది. గత కొద్దికాలంగా బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పాపారాజి అనే పదం వెనుక ఉన్న అసలు గుట్టు ప్రియమణి బయటపెట్టింది.

బాలీవుడ్ స్టార్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ ఫోటోలు తీస్తూ పాపారాజి లు ప్రత్యక్షమవడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కూడా మారుతాయి. రెస్టారెంట్స్, ఎయిర్ పోర్ట్స్, జిమ్ ఇలా ఎన్నో ప్రదేశాలలో బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు పాపారాజిలు. ఇది చూసిన నెటిజన్స్..స్టార్స్ ఎక్కడ ఉంటే అక్కడికి ఫోటోగ్రాఫర్స్ అదే పనిగా వెళ్తూ ఉంటారు అని భావిస్తారు. 

అయితే వాస్తవం అది కాదట.. డబ్బులు ఇచ్చి మరీ బాలీవుడ్ స్టార్స్ ఫోటోగ్రాఫర్స్ ను తాము ఉన్న చోటుకు పిలిపించుకుంటారట. ఇది కేవలం సోషల్ మీడియాలో తమ గురించి ప్రమోషన్ చేసుకోవడం కోసం బాలీవుడ్ స్టార్స్ ఉపయోగించే ఒక ప్రమోషన్ స్టంట్ అని ప్రియమణి వెల్లడించింది. జవాన్ మూవీలో తర్వాత తన  అసిస్టెంట్ మనం కూడా ఇలా ఫోటోగ్రాఫర్ ని పెట్టుకుంటే బాగుంటుంది అని సలహా ఇవ్వడం తో ప్రియమణి షాక్ అయ్యిందట. బాలీవుడ్ స్టార్స్ లో ఎంతోమంది తమ క్రేజ్ ని పెంచుకోవడం కోసం భారీగా ఖర్చు పెట్టి మరి ఈ కల్చర్ ని ఫాలో అవుతారు అని ప్రియమని చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన

Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News