Fire Accident In School Bus Near Guntunr Tanali Village: ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం పది తర్వాత, సాయంత్రం నాలుగు తర్వాత బైటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉద్యోగాలు, బిజినెస్ పనుల కోసం వెళ్లేవారు తప్పనిసరిగా కొన్నిజాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఎండలు మండిపోతుండటంతో ప్రభుత్వం కూడా స్టూడెంట్స్ కు ఒంటిపూట పాఠశాలలను నడుపుతున్నాయి.
Read More: Elephant Attacks: టూరిస్టులకు బిగ్ షాక్.. సఫారీట్రక్ ను ఎత్తిపాడేసిన ఏనుగు..వైరల్ వీడియో..
ఉదయంనుంచి మధ్యాహ్నాం వరకు మాత్రమే విద్యార్థులకు స్కూల్స్ లో క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే ఎండల ప్రభావం వల్ల.. కొన్ని వాహానాలలో మంటలు వ్యాపించిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రోడ్లపై అనేక కార్లు, వెహికిల్స్ అగ్ని ప్రమాదాలకు గురైన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు మంటలలో చిక్కుకుంది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో సంభవించింది.
పూర్తివివరాలు..
ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో రన్నింగ్ లో ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. తెనాలి - దుర్గి నుంచి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి. దుర్గిలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు మంటలలో కాలిబూడదయ్యింది. బస్సులో మంటలు చెలరేగగానే విద్యార్థులు అలర్ట్ అయి కిందకు దిగేశారు. దీంతో 30 మంది విద్యార్థులు మంటల నుంచి తప్పించుకోగలిగారు. కాసటికే మంటలు బస్సంతా వ్యాపించాయి.
కళ్లముందే బస్సంతా అగ్నికి ఆహుతిలాగా మారిపోయింది. పెద్ద ప్రమాదం తప్పడంతో అక్కడి వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై అధికారులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బస్సులో విద్యార్థులు ఉన్నప్పుడు ప్రమాదం జరిగిఉంటే పరిస్థితి ఏంటని కూడా, స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఎలాంటి ఆపద కాకపోవడంతో, ఊపిరీ పీల్చుకున్నారు. ఈ ఘటనపై స్టూడెంట్స్ తల్లిదండ్రులు వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook