Ys Jagan Tour: నాడు-నేడు రెండవ విడత పనుల్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Ys Jagan Tour: కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దే కార్యక్రమం ఏపీలో కొనసాగుతోంది. నాడు-నేడు కార్యక్రమం రెండవ విడత పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ శ్రీకారం చుట్టునున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 16, 2021, 09:09 AM IST
Ys Jagan Tour: నాడు-నేడు రెండవ విడత పనుల్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Ys Jagan Tour: కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దే కార్యక్రమం ఏపీలో కొనసాగుతోంది. నాడు-నేడు కార్యక్రమం రెండవ విడత పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడమే కాకుండా, మౌళిక సదుపాయాల్ని కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంగా చేపట్టిన ఏపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం ఓ హైలైట్‌గా నిలుస్తోంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే నాడు-నేడు తొలి విడతలో 3 వేల 669 కోట్లతో 15 వేల 715 స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)ఇవాళ తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం చేరుకుంటారు. తొలి విడత పనులు పూర్తి చేసుకున్న జడ్పీ హైస్కూల్ పాఠశాలను ప్రారంభించి..రెండవ విడత కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. 

తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి..11 గంటలకు పి గన్నవరం చేరుకుంటారు. జడ్పీ హైస్కూల్ ప్రారంభించిన అనంతరం రెండవ విడత (Nadu-Nedu)పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యాకానుక(jagananna Vidya kanuka) రెండవ విడత పంపిణీని 731 కోట్లతో ప్రారంభిస్తారు. ఆ తరువాత అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. విద్యార్ధుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మినరల్ ప్లాంట్‌ను ప్రారంభించి..బహిరంగసభలో ప్రసంగిస్తారు. మద్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు

Also read: AP Corona Update: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News