AP Elections 2024: వైసీపీలో మళ్లీ మార్పులు, రాజుకుంటున్న అసంతృప్తి, అసలేం జరుగుతోంది

AP Elections 2024: ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ప్రకటించిన ఇన్‌ఛార్జ్‌లను కూడా చివరి నిమిషంలో మార్చుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2024, 08:05 AM IST
AP Elections 2024: వైసీపీలో మళ్లీ మార్పులు, రాజుకుంటున్న అసంతృప్తి, అసలేం జరుగుతోంది

AP Elections 2024: ఏపీలో వైనాట్ 175 లక్ష్యం పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే 8 జాబితాలతో అభ్యర్ధుల్ని ప్రకటించారు. ఇప్పుడు మూడో జాబితాతో కొన్ని మార్పులు చేశారు. రాష్ట్రమంతా ఆకర్షిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మళ్లీ మార్పులు చేశారు. 

ఏపీలో అధికార పార్టీ చేస్తున్న మార్పులు చేర్పులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అర్ధం కావడం లేదు. ప్రకటించిన అభ్యర్ధుల్ని కూడా మార్చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా చివరి నిమిషంలో మార్పులు చేర్పులకు సిద్ధంగా ఉండమని పార్టీ నేతల్ని సూచిస్తూ అదే పని చేస్తున్నారు. ఇప్పటికే 7వ జాబితా నుంచి మార్పులు చేర్పులు కన్పిస్తున్నాయి. తాజాగా 9వ జాబితాలో కీలకమైన మంగళగిరి, నెల్లూరు విషయంలో మార్పులు చేశారు. 

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను మార్చి ఆ స్థానంలో గంజి చిరంజీవిని నియమించినప్పుడే ఈ మార్పు చర్చనీయాంశమైంది. ఈ మార్పుతో అసంతృప్తికి గురైన ఆర్కే పార్టీ వీడారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని నెల తిరక్కుండానే తిరిగి సొంతగూటికి వచ్చేశారు. ఇప్పుడు గంజి చిరంజీవిని కూడా మార్చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మరో బీసీ అభ్యర్ధి మురుగుడు హనుమంతరావు కోడలైన లావణ్యను బరిలో దింపింది. మరిప్పుడు గంజీ చిరంజీవికి పార్టీ ఎలా నచ్చచెప్పింది. ఎలాంటి పరిణామాలు దారి తీస్తాయోనననేది ఆసక్తిగా మారింది. మంగళగిరిలో గెలుపే లక్ష్యంగా అన్ని విషయాల్ని పరిగణలో తీసుకుంటున్న వైఎస్ జగన్..గంజి చిరంజీవిని తప్పిస్తే ఎదురయ్యే పరిణామాల్ని ఏ రకంగా తీసుకున్నారనేది అర్ధం కావడం లేదు. 

ఇప్పుడు గంజి చిరంజీవి, ఆర్కే, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల అందరూ కలిసి లావణ్యను నెగ్గించుకురాగలరా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు నెల్లూరు జిల్లాలో మరో పరిస్థితి. నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ టికెట్ రాకపోవడంతో అలిగి పార్టీ వీడారు. ఆ స్థానంలో ఎంపీగా పార్టీ నిలబెట్టిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ స్థానం విషయంలో పార్టీ అధిష్టానంతో అలిగి రాజీనామా చేశారు. చివరికి నెల్లూరు పార్లమెంట్ బరిలో మరో నాలుగేళ్ల పదవీకాలమున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని బరిలో దించారు. 

ఇక ఇటీవలే పదవీ విరమణ చేసి వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్‌ను 9వ జాబితాలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. మరి ఇక్కడ్నించి ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ వర్గం ఎలా అర్ధం చేసుకుంటుంది, ఏ మేరకు సహకరిస్తుందనేది ఆసక్తిగా మారింది. 

Also read: AP Politics 2024: పవన్ వ్యాఖ్యల ప్రభావం ఆ వర్గంలో చీలిక తెచ్చిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News