చిరుద్యోగులకు చంద్రబాబు తీపి కబురు

పదేళ్లలో నిర్వీర్యమైన డ్వాక్రా సంఘాలకు తిరిగి ప్రాణం పోశామని, మహిళా సంఘాలకు ఈ ఏడాది రూ.14వేల కోట్లను రుణంగా అందించామని సీఎం అన్నారు.

Last Updated : Jul 28, 2018, 09:16 AM IST
చిరుద్యోగులకు చంద్రబాబు తీపి కబురు

ఏపీలోని గ్రామైక్య సంఘాల సహాయకులు (వీవోఏ), రీసోర్స్ పర్సన్‌లకు ప్రతినెలా రూ.3వేల గౌరవ వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే వారు పనిచేసే సంఘాల లాభాలను బట్టి నెలకు రూ.2 వేలు మించకుండా ప్రోత్సాహకం అందిస్తామని, మొత్తం రూ.5వేలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకోసం రూ.వంద కోట్లు కేటాయిస్తున్నట్లు శుక్రవారం ఉండవల్లిలోని ప్రజాదర్బారు హాలులో వారితో భేటీ సందర్భంగా వివరించారు. ప్రతి ఒక్కరికీ రెండు జతల దుస్తులు, గుర్తింపు కార్డులు ఇస్తామని సీఎం వెల్లడించారు.

 

పదేళ్లలో నిర్వీర్యమైన డ్వాక్రా సంఘాలకు తిరిగి ప్రాణం పోశామని, మహిళా సంఘాలకు ఈ ఏడాది రూ.14వేల కోట్లను రుణంగా అందించామని సీఎం అన్నారు. ప్రతి ఇంటికి బ్యాంకింగ్ సేవలను తీసుకెళ్లిన ఘనత మహిళా సంఘాలకే దక్కుతుందని.. మహిళా స్వయం సంఘాల పొదుపు ఉద్యమంలో వీవోఏ, రిసోర్స్‌ పర్సన్స్‌ల పాత్ర కీలకం అని సీఎం కితాబిచ్చారు. కాగా సీఎం నిర్ణయంతో 27,750 మంది వీవోఏలు, 8 వేల మంది రీసోర్స్ పర్సన్‌లకు లబ్ది చేకూరనుంది.  వేతనాలు, వీరి పనిబాధ్యతలపై త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి.

 

Trending News