ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఘనత చంద్రబాబుదే - నారా లోకేష్

ఆరోగ్యపరిరక్షణ విషయంలో ఏపీ రెండో స్థానంలో నిలవడంపై ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ స్పందించారు

Last Updated : Jun 25, 2019, 09:37 PM IST
ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఘనత చంద్రబాబుదే - నారా లోకేష్

ఆరోగ్య పరిరక్షణలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది.మొదటి స్థానంలో కేరళ నిలవగా యూపీ అట్టడుగు స్థానంలో నిలిచింది.  ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ స్పందించారు. నితి ఆయోగ్ ఆరోగ్య నివేదిక ప్రకారం ఏపీ 2015-17 మధ్యకాలంలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ  ... చంద్రబాబు హయంలో  ఆరోగ్య పరిరక్షణ ఏ విధంగా సాగిందో ఇదే నిదర్శనమని నారా లోకేష్ పేర్కొన్నారు. మొత్తం 23 ఆరోగ్య సూచికలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందిస్తారని..అలాంటి జాబితాలో మన రాష్ట్రం టాప్ 2 లో నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఈ ఘనత చంద్రబాబు అవిశ్రాంత కృషి ఫలితమేన్నారు.

 

Trending News