TTD clarity overs annaprasadam and laddu dittam rumours: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. ఇటీవల ఎన్నికలలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏపీ నుంచి తన ప్రక్షాళన ప్రారంభించారు. అంతేకాకుండా.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక నిర్ణయాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈవోను కూడా తొలగించి, శ్యామల్ రావును నూతన ఈవోగా నియమించారు. దీంతో భక్తులకు స్వామివారిని దర్శించుకోవడంలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఈవో శ్యామల్ రావు.. తరచుగా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Read more: Snake bite: ఇదేం విడ్డూరం.. నెల వ్యవధిలో 5 సార్లు కాటేసిన పాము.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..
దీనిలో భాగంగా ఇటీవల 1200 మెట్ల వద్ద గతంలో మాదిరిగానే టికెట్లను ఇచ్చే విధానం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా, ఈవో శ్యామల్ రావు నిరంతరం అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఇటీవల టీటీడీ నిర్వహించి ఒక సమావేశం విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కలియుగ ప్రత్యక్షదైవం.. తిరుమలలో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు సేంద్రియ బియ్యం వాడకం ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు దాన్ని నిలిపివేశామని, మరల గతంలో మాదిరిగా బియ్యంను ఉపయోగిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిలో పాటు.. అన్నప్రసాదాల విషయంలో కూడా దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రచారం తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది.
అంతేకాకుండా.. ఈ విషయంపై కూడా..టీటీడీ సీరియస్ అయ్యింది. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కిందట అర్చక స్వాములు, ఆలయ అధికారులతో టీటీడీ ఈవో శ్యామల రావు సమావేశం అయ్యారు. సోషల్ మీడియాలో అన్నప్రసాదం, దిట్టం పెంపు వంటి వార్తలలో నిజంలేదన్నారు. ఈ పుకార్లు పూర్తిగా అవాస్తవమని అన్నారు. దీన్ని శ్రీవారి భక్తులు నమ్మోద్దంటూ కూడా టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ప్రజా సంబంధాల అధికారి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..
శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు కొండకు వస్తుంటారు. స్వామి వారిని కంటి నిండా చూసుకునేందుకు భక్తులు ఆశపడుతుంటారు. నిత్యం వేలాది మందికి అన్నప్రసాదం పంపిణి జరుగుతు ఉంటుంది.ఈ క్రమంలో.. టీటీడీ అన్న ప్రసాదం తయారీలో సేంద్రీయ బియ్యం వాడకాన్ని ఆపివేయాలని, దిట్టం పెంచుతూ నిర్ణయించినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ ఒకటి వైరల్ అయ్యింది. కాగా, కరోనా సమయంలో తిరుమల లడ్డులకు ఉపయోగిస్తున్న ఇంగ్రిడియంట్స్ లను తగ్గిస్తు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ దిట్టంను పెంచుతున్నట్లు పుకార్లు వైరల్ అయ్యాయి. దీన్ని పూర్తిగా అవాస్తవమని, టీటీడీకి భంగం కలిగే విధంగా ఫేక్ వార్తలు వైరల్ చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా టీటీడీ స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి