National Highway: ఏపీలో మరో జాతీయ రహదారికి గ్రీన్‌సిగ్నల్, అనంతపురం-గుంటూరు మద్య కొత్త హైవే

National Highway: మొన్న బెంగళూరు-విజయవాడ జాతీయ రహదారికి గ్రీన్‌సిగ్నల్ పడగా, ఇప్పుడు అనంతపురం-గుంటూరు రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 18, 2022, 06:42 PM IST
National Highway: ఏపీలో మరో జాతీయ రహదారికి గ్రీన్‌సిగ్నల్, అనంతపురం-గుంటూరు మద్య కొత్త హైవే

ఆంధ్రప్రదేశ్‌కు మరో జాతీయ రహదారి వస్తోంది. అనంతపురం నుంచి గుంటూరు నేషనల్ హైవేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ వివరాలు మీ కోసం..

కేంద్ర ప్రభుత్వం ఏపీలో మరో జాతీయ రహదారికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం నుంచి గుంటూరు మధ్యలో 417 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని నేషనల్ హైవేస్ అధారిటీ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో నిర్మించనున్నారు. ఏకంగా 9 వేల కోట్ల ఖర్చుతో ఈ హైవే నిర్మాణం జరగనుంది. 

కొత్త హైవే ఏయే ఊర్ల మీదుగా

అనంతపురం-గుంటూరు 417 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారి నెంబర్ 544డి తాడిపత్రి, కొలిమిగుండ్ల, ఓక్, బనగానపల్లి, నంద్యాల, గాజులపల్లి, గిద్దలూరు, కంభం, తోకపల్లి, వినుకొండ, నరసరావుపేట మీదుగా ఉంటుంది. 

ఏపీ ఇప్పటికే బెంగళూరు-కడప-విజయవాడ నేషనల్ హైవేను సొంతం చేసుకుంది. ఇప్పుడు అనంతపూర్-గుంటూరు మరో జాతీయ రహదారి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఈ కొత్త రహదారి అందుబాటులోకి వస్తే..విజయవాడ, బెంగళూరు మధ్య 75 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. అదే సమయంలో 2 గంటల సమయం కూడా ఆదా కానుంది. 

Also read: Tanu Sri Arrested: భలే ఉన్నావ్ పెళ్లి చేసుకుందామా?.. టిక్ టాకర్ వలపు వల.. చిక్కిన వారు విలవిల!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News