Vivekananda Reddy CBI: వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. అతడ్ని అరెస్ట్ చేసిన అనంతరం.. కోఠి లోని సీబీఐ కార్యాలయానికి తరలించారు అధికారులు. ఇవాళ సాయంత్ర శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. దస్తగిరి వాంగ్మూలం మేరకు శివశంకర్‌రెడ్డి పేరు ప్రముఖంగా ప్రస్తావనలోకి వచ్చింది. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల్లో శివశంకర్‌రెడ్డి పేరు ఉంది. ఇప్పటికే కడప, పులివెందులలో శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. అయితే.. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి డ్రైవర్ దస్తగిరి లోంగిపోయాడు.
Also Read: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థత..ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలింపు
Also Read: Madanapalle Tomato Price: రాష్ట్రంలో రూ.100 లకు పెరిగిన కిలో టమాటా ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook