Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మరోసారి తెరపైకొచ్చింది.  విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2021, 05:37 PM IST
Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మరోసారి తెరపైకొచ్చింది.  విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తోంది.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రారంభమైన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌(Vizag Steel plant)ను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government)నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక, ఉద్యోగ సంఘాలు, అఖిలపక్షం ఆందోళన నిర్వహిస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా ఆందోళనకు మద్దతిస్తోంది. ఇప్పటికే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రదానమంత్రి నరేంద్ర మోదీకు లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్( Captive mines) కేటాయించాలని..స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్నించి గట్టెక్కించేందుకు చాలా అవకాశాలున్నాయని చెప్పారు. విశాఖ ఉక్కు తెలుగు ప్రజలు ఆత్మగౌరవానికి సంబంధించిందని చెప్పారు. 

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు( Vizag Steel plant privatisation) వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ( Assembly resolution) చేస్తామని ఫిబ్రవరిలో నెలలోనే వైఎస్ జగన్ (Ap cm ys jagan) ప్రకటించారు. అ తరువాత అసెంబ్లీ సమావేశాలవడం ఇదే. బడ్దెట్ కోసం ఏర్పాటైన ఒకరోజు సమావేశంలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ అంశానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. బడ్జెట్ ప్రక్రియ పూర్తయిన తరువాత పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా..అసెంబ్లీ ఆమోదించింది. 

Also read: Ys Jagan: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు, వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News