కరుణానిధిని ఎన్టీఆర్ తో పోల్చిన చంద్రబాబు

                     

Updated: Aug 8, 2018, 07:11 PM IST
కరుణానిధిని ఎన్టీఆర్ తో పోల్చిన చంద్రబాబు

గుంటూరు: దిగంగత నేత కరుణానిధి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రాబు సంతాపం తెలిపారు. ఈ రోజు మంగళరిలో జరుగుతున్న నోడల్ అధికారుల రాష్ట్ర స్థాయి సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కరుణానిధి మృతికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ లా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన కరుణానిధి..గొప్ప పరిపాలనా దక్షుడు, సామాజిక ఉద్యమ నేత అని చంద్రబాబు కొనియాడారు.

ఎన్టీఆర్ లా ఆయన దేశ రాజకీయాలను ప్రభావితం చేశారని... దేవెగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాల ఏర్పాటులో కరుణానిధిది కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. దక్షిణ భారత దేశాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో కరుణానిధి ఒకరని చంద్రబాబు కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు కరుణానిధి అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. కరుణానిధికి తనకు మధ్య ఉన్న సాన్నిహిత్యంగా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.