ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అభ్యర్ధిగా పోతుల సునీతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేశారు. ఈ మేరకు ఆమెకు బీఫామ్ అందించారు.
ఏపీ శాసనమండలి ( Ap legislative council ) లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ సైతం వెలువడింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr congress party ) అభ్యర్ధిగా పోతుల సునీతను వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఖరారు చేశారు. ఇవాళ ఆమెకు బీఫామ్ కూడా అందించారు. తన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసినందుకు పోతుల సునీత జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
పోతుల సునీత ( Pothula sunitha ) వెంట బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పోతుల సురేష్ ఉన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత..చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేశారు. తరువాత అధికారపార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారయ్యారు. దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ( Paritala Ravindra ) కు అత్యంత సన్నిహితుడిగా , సహచరుడిగా పోతుల సురేష్ వ్యవహరించారు. రవి హత్యానంతరం కూడా పరిటాల కుటుంబంతో ఉన్న పోతుల సురేష్..అనంతరం చంద్రబాబు వైఖరికి విసిగి..వైసీపీలో చేరారు.
Also read: AP: కోడ్ దాటుకుని..ప్రారంభమైన అమ్మఒడి పథకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook