Jagananna Aarogya suraksha Scheme: జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌. జగన్‌

Jagananna Aarogya suraksha Scheme Benefits: జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పూర్తిగా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్‌ చేయబోతున్నామని... ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటినీ, జల్లెడ పట్టి, ఏ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆ ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు అక్కడే చేసేటట్టుగా, వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందించేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం అని సీఎం జగన్ ప్రకటించారు. 

Written by - Pavan | Last Updated : Sep 30, 2023, 05:59 AM IST
Jagananna Aarogya suraksha Scheme: జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌. జగన్‌

Jagananna Aarogya suraksha Scheme Benefits: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష పధకాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌... గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌ స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాముఖ్యత గురించి మీకు నాలుగు మాటల్లో చెబుతాను... అంటూ గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం జరగలేదు. గొప్పగా చేయగలుగుతామనే విశ్వాసంతోనే దీన్ని ప్రారంభిస్తున్నాం అని తెలిపారు. 

ఆరోగ్య సురక్ష- ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం.
ప్రివెంటివ్‌ కేర్‌లో ఇదొక నూతన అధ్యాయం అని చెప్పుకొచ్చిన సీఎం జగన్.. ఈ స్ధాయిలో రాష్ట్రంలో, దేశంలో ఇప్పటివరకు ఎవ్వరూ, ఎప్పుడూ, ఎక్కడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు అని అన్నారు. మనం ధైర్యంగా, సాహసోపేతంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి కారణం క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ఉన్న సిబ్బందే. ఇవాళ ప్రతి గ్రామంలోనూ 10,032 సచివాలయాల పరిధిలో మనం విలేజ్‌ క్లినిక్స్‌ను తీసుకువచ్చి.. నిర్వహణలో ఉంచగలిగాం. అదే విధంగా 542 అర్భన్‌ హెల్త్‌ సెంటర్లు కూడా వివిధ మున్సిపాల్టీలలో అందుబాటులోకి తీసుకునిరాగలిగాం. ఇందులో ఉండాల్సిన సిబ్బందిని నియమించాం అని చెప్పిన సీఎం జగన్.. ఇదంతా క్షేత్రస్థాయిలో సిబ్బంది కృషి వల్లే సాధ్యమైందన్నారు.

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌.
అంతే కాకుండా ప్రివెంటివ్‌ కేర్‌లో గొప్ప అధ్యాయంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ను తీసుకొచ్చామని... ప్రతిమండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో ఒక 104 వాహనం, ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నాం. మొత్తంగా మండలంలో 4 డాక్టర్లుకూ ఆ మండలంలోని గ్రామాలను సమానంగా పంచాం. ఆ డాక్టర్లు నిర్దేశిత నాలుగైదు గ్రామాల్లో సేవలు అందిస్తారు. ప్రతి డాక్టరు ఒక రోజు పీహెచ్‌సీలో ఉంటే, రెండో డాక్టరు 104 ఆంబులెన్స్‌లో తనకు కేటాయించిన గ్రామానికి వెళ్లి విలేజ్‌ క్లినిక్స్‌తో అనుసంధానమై సేవలందిస్తారు. ప్రతి డాక్టర్‌ తనకు సంబంధించిన గ్రామానికి నెలకు కనీసం రెండు సార్లు  వెళ్లేలా ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఒకే డాక్టర్, ఒకే గ్రామానికి నెలకు రెండు సార్లు వెళ్తున్నారు. ఆరు నెలలు అదే కార్యక్రమం చేస్తే.. ఆగ్రామంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యంమీద ఒక అవగాహన డాక్టరుకు ఉంటుంది. ఆ తర్వాత ఆ గ్రామానికి వెళ్లేటప్పుడు వారికి కావాల్సిన మందులు తీసుకెళ్లి వారికి అండగా నిలిచే అవకాశం కలుగుతుంది. ఇదిఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌. ఇది కూడా మనం తేగలిగాం అని తెలిపారు.  

వైద్యం కోసం అప్పులు పాలు కాకూడదనే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ
వైద్యం కోసం అయ్యే ఖర్చుల కోసం పేదవాడు అప్పులు పాలు కాకూడదనే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చామని.. గతంలో 1,056 ప్రోసీజర్స్‌కు పరిమితమైన ఆరోగ్యశ్రీని 3256 చికిత్సలను విస్తారించామని అన్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులను పెంచామన్నారు. గతంలో 915 నెట్‌వర్క్‌ ఆసుపత్రులుంటే ఈరోజు 2200 పైచిలుకు నెట్‌వర్క్‌ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకునిరాగలిగాం. 
వీటన్నింటి వల్లా పేదవాడికి వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా అందుబాటులోకి తీసుకునిరాగలిగాం అని చెప్పుకొచ్చారు. 

ఆరోగ్య సురక్ష విలేజ్ మ్యాపింగ్‌.
ఈ రోజు మనం చేసే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పూర్తిగా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్‌ చేయబోతున్నాం. ప్రతి గ్రామంలోనూ,  ప్రతి ఇంటినీ, జల్లెడ పడుతున్నాం. ఏ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆ ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు అక్కడే చేసేటట్టుగా, వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆ తర్వాత గ్రామంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్టు డాక్టర్ల చేత వారికి చికిత్స అందిస్తున్నాం. ఆ తర్వాత వారికి తదుపరి పరీక్షలు అవసరమైతే అవి కూడా చేయించి, వారికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నాం. ఆ పేషెంట్‌కు నయం అయ్యే దాకా ఆ పేషెంట్‌ను చేయిపట్టి నడిపిస్తాం. ఇవన్నీ ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో భాగం కాబోతున్నాయి అని సీఎం జగన్ ప్రకటించారు.

Trending News