CM YS Jagan: ఆ నిరుపేదల కోసం సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

నిరుపేదలకు అందరికీ స్థిర నివాసం ఉండాలని సంకల్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jagan).. అధికారంలోకి రాకముందే నవరత్నాలులోనే ( Navaratnalu ) ఆ అంశాన్ని చేర్చి ఆ దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి నిరుపేదలకు గృహ నిర్మాణంపై దృష్టి సారించిన సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Last Updated : Jun 3, 2020, 08:38 AM IST
CM YS Jagan: ఆ నిరుపేదల కోసం సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

అమరావతి: నిరుపేదలకు అందరికీ స్థిర నివాసం ఉండాలని సంకల్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jagan).. అధికారంలోకి రాకముందే నవరత్నాల్లోనే ( Navaratnalu ) ఆ అంశాన్ని చేర్చి ఆ దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి నిరుపేదలకు గృహ నిర్మాణంపై దృష్టి సారించిన సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం పేదలకు చెల్లించకుండా వదిలేసిన ఇళ్ల బకాయిలను కూడా తిరిగి లబ్ధిదారులకు చెల్లించాలని సీఎం జగన్‌ నిర్ణయించుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 3,38,144 ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. 

ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో గత ప్రభుత్వం హయాంలో గృహ నిర్మాణం బిల్లు పొందని 3,38,144 మందికి లబ్ధి చేకూరనుంది. పేదలకు ఇళ్ల నిర్మాణంపై మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో ( Jagan review meeting ) ఈ నిర్ణయం తీసుకున్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఇదే విషయంపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పటి లబ్ధిదారులకు ( Beneficiaries ) బకాయిపెట్టి చేతులు దులుపుకుందని.. అందుకే అప్పుడు నష్టపోయిన పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక మొదలు, వారికి బకాయిల చెల్లింపుల ( Dues payments ) వరకు ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా చెల్లింపులు ( Payments ) పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News