AP: రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు

ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. రికవరీ రేటు పెరుగుతోంది.

Last Updated : Sep 21, 2020, 10:26 PM IST
AP: రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు

ఏపీ ( Ap ) లో కరోనా నిర్ధారణ పరీక్షలు ( Corona tests ) రోజురోజుకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. రికవరీ రేటు పెరుగుతోంది. 

కరోనా వైరస్ ( Corona virus ) ప్రారంభమైనప్పటి నుంచి నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వ ( Ap Government ) చర్యలకు ఫలితం కన్పిస్తోంది. గత 4-5 రోజులుగా రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. నిర్ధారణ పరీక్షలు మాత్రం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 56 వేల 569 పరీక్షలు నిర్వహించగా...కేవలం 6 వేల 235 పాజిటివ్ కేసులే నమోదయ్యాయి. వారం రోజుల ముందు వరకూ రాష్ట్రంలో రోజుకు దాదాపు 10 వేల కొత్త కేసులు వెలుగుచూస్తుండేవి. ఇప్పుడా సంఖ్య గణనీయంగా తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకూ 51 లక్షల 60 వేల 7 వందల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 6 లక్షల 31 వేల 749 కాగా..యాక్టివ్ కేసులు ( Active cases in ap ) మాత్రం కేవలం 74 వేల 518 ఉన్నాయి. నిర్ధారణ పరీక్షల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ..ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం వల్లనే కొత్త కేసుల సంఖ్య తగ్గుతోందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ట్రూ నాట్ పద్ధతిలో 30 వేల 85 పరీక్షలు, ర్యాపిండ్ టెస్టింగ్ లో 26 వేల 484 పరీక్షలు చేశారు.  

కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లో  51 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 5 వేల 410 కు చేరింది. అదే సమయంలో రాష్ట్రంలో రికవరీ రేటు ( Ap corona recovery rate ) కూడా గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 10 వేల 502 మంది కోలుకున్నారు.  ఇప్పటివరకూ రాష్ట్రంలో 5 లక్షల 51 వేల 821 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.  Also read: Anil Kumar Yadav: పోలవరం బకాయిలపై కేంద్ర మంత్రి సానుకూల స్పందన

Trending News