ఏపీలో 3వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో మొత్తం కేసులు 3 వేలు దాటిపోయాయి.

Updated: Jun 2, 2020, 02:19 PM IST
ఏపీలో 3వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

#APFightsCorona | ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రికవరీ రేటు భారీగానే ఉన్నప్పటికీ ఏపీలో కరోనా కేసులు 3 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో తాజాగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరో రెండు కరోనా మరణాలు సంభవించాయి.  LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్

రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,370 శాంపిల్స్ పరీక్షించగా 98 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,042కు చేరింది. ఈ మొత్తం కేసులకుగానూ 2,135 మంది డిశ్ఛార్జ్ కాగా, ఇప్పటివరకూ కరోనా బారిన పడి 62 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 845 యాక్టీవ్ కేసులున్నాయి. వీరు అన్ని జిల్లాల్లోని కోవిడ్19 ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.  చిరంజీవి, రామ్ చరణ్‌లపై తేనేటీగల దాడి

Image Credit: twitter/@ArogyaAndhra
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి