చంద్రబాబు నివాసంపై డ్రోన్ ప్రయోగంపై డీజీపీ రియాక్షన్ ఇదే

ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై డ్రోన్ ప్రయోగ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు

Last Updated : Aug 19, 2019, 03:48 PM IST
చంద్రబాబు నివాసంపై డ్రోన్ ప్రయోగంపై డీజీపీ రియాక్షన్ ఇదే

అమరావతి: ఉండవల్లిలోని  కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాస పరిసరాల్లో డ్రోన్ ప్రయోగంపై ఏపీ డీజీపీ  గౌతమ్ సవాంగ్ స్పందించారు. వరదలను అంచనా వేసేందుకు ఇరిగేషన్ శాఖ డ్రోన్ ఉపయోగించినట్లు స్పష్టం చేశారు.  డ్రోన్ ప్రయోగం గురించి పోలీసులకు ముందస్తు సమచారం లేదన్నారు. జల వనరుల శాఖ అధికారులు- పోలీసులకు మధ్య కమ్యునినేషన్ గ్యాప్ కారణంగా ఈ వివాదం నెలకొందన్నారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదని చెప్పిన డీజీపీ ...ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. ఇకపై ఎవరైనా ప్రముఖుల ఇళ్ల సమీపంలో డ్రోన్ ఉపయోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరని తెలిపారు. 

గత కొన్ని రోజుల క్రితం ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై ఉన్నప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగరడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.  దీనికి వెనుక  కుట్ర దాగుందని ఆరోపణలు సంధించిన టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.  హత్య చేయాలనే కుట్రతోనే ఇలా చేశారని విరమ్శలు సంధించారు.  కాగా ఈ అంశంపై  ప్రతిపక్ష నేత  చంద్రబాబు డీజీపీకి ఫోన్ లో మాట్లాడారు. హై సెక్యూరిటీ జోన్‌లో ఈ రకంగా డ్రోన్లను ఎలా వినియోగిస్తారన్న చంద్రబాబు... డ్రోన్ల వినియోగానికి మీరు ఎవరికైనా అనుమతి ఇచ్చారా అని చంద్రబాబు డీజీపీని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఘటనపై విచారణ జరిపిన డీజీపీ  గౌతమ్ సవాంగ్ ఈ మేరకు స్పందించారు

Trending News