ఏపీకి మూడు రాజధానులొద్దు.. విశాఖ చాలు: మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు

మూడు రాజధానుల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మాజీ సీఎస్ ఐవైఆర్ సైతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఒక్క రాజధాని చాలు అని అభిప్రాయపడ్డారు.

Updated: Jan 22, 2020, 01:48 PM IST
ఏపీకి మూడు రాజధానులొద్దు.. విశాఖ చాలు: మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు

అమరావతి: రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. రాజధాని అమరావతిలోనే కొనసాగాలంటూ ప్రతిపక్ష టీడీపీ నేతలతో పాటు స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజూ తమ నిరసన తెలిపుతున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైఎస్సార్ సీపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయానికి కొడుతున్నారు. శాసనసభలో పాసయిన రాజధానుల వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ రాజధాని వివాదంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Aso Read: భర్త మంచివాడే, కానీ.. విడాకులపై స్పందించిన శ్వేతాబసు

ఏపీకి మూడు రాజధానులు అనవసనమని ఐవైఆర్ పేర్కొన్నారు. ఒకటే రాజధాని ఉండాలని, అది కూడా విశాఖలో ఉంటే బెస్ట్ అని పరోక్షంగా తెలిపారు. ఈ మేరకు ఐవైఆర్ ట్వీట్ చేశారు. ‘బ్రిటీష్ వారు ఇచ్చిన రాజధాని ఢిల్లీ. అనుకూలత కోసం వారు రాజధానిని కలకత్తాలో ఏర్పాటు చేశారు అనంతరం ఢిల్లీకి మార్చారు. మనకు కూడా మూడు రాజధానులు అవసరం లేదు. రాజధాని విశాఖలో, హైకోర్టు కర్నూల్‌లో ఏర్పాటు చేయాలి. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించడం అంటే బ్రిటీష్ వారు దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడంతో పోల్చవచ్చునంటూ’ మాజీ సీఎస్ ఐవైఆర్ ట్వీట్ చేశారు. అన్నీ ఒకే చోట.. దేశ రాజధాని ఘనత అనే పేపర్ క్లిప్పింగ్‌ను ట్వీట్‌కు జత చేశారు.

కాగా, రాజధాని వికేంద్రకరణ బిల్లును ఎలాగైనా చట్టంగా మార్చాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. శాసనసభలో మెజార్టీ సంఖ్యా బలంతో సులువుగా బిల్లు పాస్ అయింది. అయితే శాసనమండలిలో ప్రతిపక్ష టీడీపీకి మెజార్టీ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. లేనిపక్షంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టంగా మార్చే దిశగానూ ఏపీ సర్కార్ పావులు కదుపుతోందని సమాచారం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..