ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) కు సంబంధించిన కీలకమైన ఆర్ధిక విషయాలపై మంత్రి రాజేంద్రనాధ్ రెడ్డి ( Minister Buggana Rajendranath reddy )..కేంద్ర మంత్రితో చర్చించారు. పోలవరం సహా వివిధ బకాయిల్ని చెల్లించాలని మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరినట్టు బుగ్గన రాజేేంద్రనాధ్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాధ్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటన ( Delhi Tour ) చేపట్టారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Central Finance minister Nirmala sitharaman ) ను కలిసి రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు జీఎస్టీ బకాయిలు, వివిధ ఇతర పధకాల నిధులపై కేంద్ర ఆర్ధిక మంత్రితో చర్చించామని మంత్రి బుగ్గన తెలిపారు. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని మరోసారి చర్చించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు 3 వేల కోట్లకు పైగా జీఎస్టీ బకాయిలు రావల్సి ఉంది. అటు పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధుల్ని రీయింబర్స్ చేయాల్సి ఉంది.
ఇవే అంశాల్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Ap cm ys jagan ) పర్యటన సందర్భంగా కూడా ప్రస్తావనకొచ్చాయి. పోలవరం బకాయిలను కేంద్రం త్వరగా విడుదల చేస్తే బాగుంటుందని మంత్రి బుగ్గన అభిప్రాయపడ్డారు. తాము ప్రతిపాధించిన అన్ని అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారన్నారు. బకాయిల చెల్లింపులనేవి ఓ నిరంతర ప్రక్రియలా కొనసాగుతూనే ఉంటాయన్నారు. Also read: YS Jagan: హుటాహుటిన హైదరాబాద్కు వైఎస్ జగన్.. నేరుగా ఆస్పత్రికి ఏపీ సీఎం