AP Schools Reopen: ఏపీలో 2023-24 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదలైంది. జూన్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్, కళాశాలలు తెర్చుకోనున్నాయి. దాదాపు రెండు నెలల సెలవుల అనంతరం విద్యాసంస్థలు తెర్చుకుంటున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ అకాడమిక్ క్యాలెండర్ కూడా విడుదల చేశారు.
ఏపీలో 2023-24 సంవత్సరం విద్యా క్యాలెండర్ విడుదలైంది. ఇందులో విద్యా సంవత్సరం షెడ్యూల్, ప్రిన్సిపల్, టీచర్ల విధులు, లాంగ్వేజ్ క్లబ్స్, ల్యాబ్స్, లెస్సన్ ప్లాన్స్ అన్నీ సవివరంగా ఉన్నాయి. వీటితో పాటు తెలుగు భాషా వారోత్సవరం, సాంస్కృతిక కార్యక్రమాలు, రోజుకొక పదం వంటి అంశాలున్నాయి. రాష్ట్రంలో విద్యపై ఏపీ ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి 10, 12 తరగతుల్లో టాప్ లో ఉన్నవారికి ప్రభుత్వం ఇచ్చే స్టేట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరీశిలించారు.
ఈ అవార్డున్ని జగనన్న ఆణిముత్యాలు పేరుతో మూడు దశల్లో ఇవ్వనున్నారు. నియోజకవర్గ స్థాయిలో జూన్ 15వ తేదీన, జిల్లా స్థాయిలో జూన్ 17న, రాష్ట్ర స్థాయిలో జూన్ 20వ తేదీన ఈ అవార్డులు లభించనున్నాయి. రాష్ట్రంలో టాప్ 10 ర్యాంకుల్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 64 మంది విద్యార్ధులు సొంతం చేసుకోనున్నారు. మరోవైపు విద్యా కానుక కిట్స్‌ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. నాడు నేడు కింద కవర్ అయిన స్కూళ్ల వివరాలు, ట్యాబ్స్ వినియోగంలో టీచర్లకు శిక్షణ, స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం వంటివి నాడు నేడు రెండవ దశలో ఉంటాయి.
ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలుండాలని ఒకటి బాలికలకు, రెండవది కో ఎడ్యుకేషన్‌గా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. జనాభాను బట్టి హై స్కూల్స్‌ను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అవసరమైన అదనపు తరగతులు నిర్మించి ఇస్తామన్నారు. రాష్ట్రంలో కొత్త జూనియర్ కళాశాలలు వచ్చే జూన్ నాటికి ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా అవసరమైన సిబ్బంది నియామకం పూర్తి కావాలన్నారు. బైజూస్ కంటెంట్‌తో ఉండే ట్యాబ్స్ ఎలా వినియోగించాలో టీచర్లకు 20 వేల మంది బీటెక్ విద్యార్ధులు ఇంటర్న్ షిప్‌లో భాగంగా శిక్షణ ఇవ్వనున్నారు.
రాష్ట్రలో ఏ స్కూల్‌లోనూ డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారుల్ని ఆదేశించారు. 10, 12 తరగతులు పూర్తి చేయనివారిని ప్రోత్సహించి చదువుపై ఆసక్తి కల్గించాలన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక వరుసగా నాలుగవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. నాడు నేడు తొలిదశలో కవర్ అయిన స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. సెప్టెంబర్ నాటికి ఇతర స్కూళ్లకు అమలు చేయనున్నారు. రెండవ దశ నాడు నేడులో 22,224 స్కూళ్లను ఎంపిక చేశారు. ఈ పనులు డిసెంబర్ 2023 నాటికి పూర్తి కానున్నాయి.
Also read: CM Jagan Review: ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. మళ్లీ ఛాన్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP Schools Reopen: ఏపీలో స్కూల్స్ ప్రారంభం జూన్ 12 నుంచే, విద్యా సంవత్సరం క్యాలెండర్