Ap Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పంచాయితీ ఎన్నికలు ఏకగ్రీవంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నజరానాలు ప్రకటించింది.
ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ( Ap Panchayat Elections Schedule ) విడుదలైంది. నాలుగు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. సుప్రీంకోర్టు ( Supreme Court ) తీర్పుతో అనివార్యమైన పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ( Unanimous ) ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఏకగ్రీవాలైతే భారీ నజరానాలు ( Incentives for Unanimously elected panchayats ) ప్రకటిస్తూ ప్రభుత్వం ( Ap Government ) ప్రత్యేక జీవో సైతం జారీ చేసింది. పంచాయితీల్ని నాలుగు కేటగరీలుగా విభజించింది. కేటగరీని బట్టి ప్రోత్సాహకాల్ని ప్రకటించింది.
2 వేల లోపు జనాభా ఉన్న పంచాయితీ ఏకగ్రీవమైతే..5 లక్షల రూపాయలు నజరానా అందిస్తారు. 2 వేల నుంచి 5 వేల జనాభా ఉన్న పంచాయితీ ఏకగ్రీవమైతే 10 లక్షల రూపాయలు బహుమతి అందుతుంది. ఇక 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయితీ ఏకగ్రీవమైతే 15 లక్షల రూపాయలు ప్రోత్సాహకం అందుతుంది. 10 వేల జనాభా ఉన్న పంచాయితీల్ని ఏకగ్రీవం చేస్తే..20 లక్షల రూపాయలు అందించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook