AP 10th Exams: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అందించింది. తక్కువ మార్కులొచ్చిన విద్యార్ధుల కోసం ఇంటర్మీడియట్ తరహాలో బెటర్‌మెంట్ నిర్వహించనుంది.
ఫైనల్ పరీక్షల్లో ఆశించిన మార్కుల కంటే తక్కువ వచ్చినప్పుడు అదే విద్యాసంవత్సరంలో నెలరోజుల వ్యవధిలోనే బెటర్‌మెంట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ విధానం ఇప్పటి వరకూ ఇంటర్మీడియట్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బెటర్‌మెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా పదవ తరగతి విద్యార్ధులకు బెటర్‌మెంట్ విధానం అవకాశం కల్పిస్తోంది.
ఈసారి పదవ తరగతిలో ఫెయిలైన విద్యార్ధులకు ఏడాది వృధా కాకుండా ఇదే ఏడాదిలో ప్రభుత్వం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తోంది. అదే సమయంలో తక్కువ మార్కులొచ్చిన విద్యార్ధులకు తొలిసారిగా బెటర్‌మెంట్ అవకాశాన్ని కల్పిస్తోంది. 50 కంటే తక్కువ మార్కులొచ్చిన ఏదైనా రెండు విభాగాల్ని ఎంచుకుని బెటర్‌మెంట్ పరీక్షలు రాయవచ్చు. సప్లిమెంటరీ పరీక్షతో పాటే ఈ పరీక్ష జరగనుంది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయడం, ఆన్‌లైన్‌లో సరిగ్గా చదువు సాగకపోవడంతో విద్యార్ధులకు ఆశించిన మార్కులు రాలేదనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఇంటర్మీడియట్ విద్యార్ధులకు నిర్వహించేలా బెటర్‌మెంట్ అవకాశం కల్పించింది.
బెటర్‌మెంట్ పరీక్షకు అప్లై చేసే విద్యార్ధులు ఒక్కొక్క పరీక్షకు 5 వందల చెల్లించాల్సి ఉంది. అయితే ఈ బెటర్‌మెంట్ విధానం ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుంది. పరీక్షలు జూలై 6 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నాయి.
Also read: Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో ఇక వానలే వానలు..మరింత విస్తరిస్తున్న నైరుతి రాగం..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook