AP: పెండింగు డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. పెండింగులో ఉన్న మూడు డిఏల చెల్లింపుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో డీఏ చెల్లింపుకు అంగీకరించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Oct 24, 2020, 07:23 PM IST
AP: పెండింగు డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ఉద్యోగులకు ( Ap Government Employs ) ఇది నిజంగా శుభవార్తే. పెండింగులో ఉన్న మూడు డిఏల చెల్లింపుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో డీఏ చెల్లింపుకు అంగీకరించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ ( Coronavirus ) కారణంగా ఏర్పడిన లాక్డౌన్ ( Lockdown ) నేపధ్యంలో  అన్ని రంగాలు స్థంబించాయి. అన్ని రంగాల్లో ఆర్ధిక పరిస్థితి క్షీణించింది. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో సైతం జీతాల్లో కోత పడింది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ ( కరువు భత్యం ) ల చెల్లింపుకు ముఖ్యమంత్రి  వైెఎస్ జగన్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఏ డీఏ ఎప్పుడు చెల్లించనున్నారనే విషయంపై ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. 2018 జూలై మొదటి డీఏను 2021 జనవరి జీతాలతో, 2019 జనవరి డీఏను జూలై జీతాలతో, 2019 జూలై డీఏను 2022 జనవరి జీతాలతోనూ చెల్లించే  విధంగా ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ఆదేశాలు జారీ చేసింది. 

తొలి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1 వేయి 35 కోట్ల అదనపు భారం, రెండో డీఏ ద్వారా 2 వేల 74 కోట్ల అదనపు భారం, మూడవ డీఏ చెల్లింపు ద్వారా 3 వేల 802 కోట్ల భారం ఉండనుంది. మొదటి డీఏను మూడు వాయిదాల్లో జమ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంతో 4 లక్షల 49 వేల ప్రభుత్వ ఉద్యోగులు, 3 లక్షల 57 వేల పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. 

పెండింగు డీఏల చెల్లింపులు ఆమోదం తెలపడమే కాకుండా ఏది ఎప్పుడు చెల్లించనున్నారో కార్యాచరణ వెలువరించడంపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. Also read: Andhra Pradesh: స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో కష్టమే: మంత్రి గౌతమ్ రెడ్డి

Trending News