AP DSC 2008: ఆంద్రప్రదేశ్‌లో డీఎస్సీ 2008 అభ్యర్ధులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. డీఎస్సీ అభ్యర్ధులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో 2008 డీఎస్సీ అభ్యర్ధులు( 2008 DSC Candidates) చాలాకాలంగా ఉద్యోగాల్లేక ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ అభ్యర్ధులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. డీఎస్సీ అభ్యర్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2008లో డీఎస్సీ క్వాలిఫై అయిన 2 వేల 193 మంది అభ్యర్ధులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి మినిమమ్ స్కేల్ వర్తింపజేస్తున్నట్టు తెలిపింది. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2008 అభ్యర్ధులకు న్యాయం జరిగింది.
గత ప్రభుత్వ హయాంలో కూడా డీఎస్సీ అభ్యర్ధులు ప్రభుత్వానికి విన్నవించినా ప్రయోజనం కలగలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మానవతా దృక్పథంతో డీఎస్సీ అభ్యర్ధుల సమస్యను పరిష్కరించామన్నారు. ఈ సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని..ఇప్పటికి పరిష్కారమైందని చెప్పారు.
Also read: Vaccine Drive: వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డు, ఒకేరోజు 13 లక్షలమందికి వ్యాక్సినేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook