AP: డిసెంబర్ 25న రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీకు మొదట్నించీ అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. హైకోర్టు  స్టేల కారణంగా పలుసార్లు వాయిదా పడింది. ఇక ఆ కార్యక్రమం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Last Updated : Nov 18, 2020, 05:30 PM IST
AP: డిసెంబర్ 25న రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ

ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీకు మొదట్నించీ అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. హైకోర్టు  స్టేల కారణంగా పలుసార్లు వాయిదా పడింది. ఇక ఆ కార్యక్రమం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించాలనేది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఆలోచన. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ ( House sites distribution )కు రంగం సిద్ధమైంది. భూ సేకరణ , లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసుకుని రెండు మూడు సార్లు పంపిణీకు సిద్ధమైంది. అయితే హైకోర్టు ( High court ) అభ్యంతరాల కారణంగా పలుసార్లు వాయిదా పడింది. ఇక ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని నిశ్చయించింది. హైకోర్టు స్టే ఉన్న ప్రాంతాలు మినహా..మిగిలిన అన్నిచోట్ల ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

డిసెంబర్‌ 25న అర్హులైన లబ్దిదారులకు డి-ఫామ్‌ పట్టా ఇచ్చి ఇంటి స్థలం అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30 లక్షల 68 వేల 281మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వీరందరికి పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మెదలుకానున్నాయి. తొలి దశలో దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వాస్తవానికి జూలై 8న ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కొందరు దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించడంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. అనంతరం మళ్లీ ప్రయత్నించినా..కోర్టు స్టే కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సంబంధించిన కాలనీలను ప్రభుత్వం ఎప్పుడో రూపొందించింది. ఏపీ ప్రభుత్వం ఇవ్వనున్న స్థలాలు గత ప్రభుత్వాలిచ్చినట్టు..బలహీనవర్గాల గృహ సముదాయంలా ఉండవు. విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించారు. అన్ని వసతులతో కూడిన కాలనీల్ని నిర్మించి ..అందులో ఇళ్ల స్థలాల్ని అందించనుంది ప్రభుత్వం. Also read: AP: ఎన్నికలపై నిమ్మగడ్డకు అంత తొందరెందుకు ?

Trending News