Anandayya gives clarity on Krishnapatnam ayurvedic medicine distribution: కృష్ణపట్నం: ఆనందయ్య ఔషధం పంపిణీ కార్యక్రమం తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్వయంగా ఆయనే స్పందించారు. శుక్రవారం నుంచి కృష్ణపట్నంలో ఆయుర్వేదం మందు పంపిణీ చేయనున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.
కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యం, ఔషధం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వేచిచూస్తున్నామని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే తిరిగి కరోనాకు ఆయుర్వేదం మందు (Corona ayurvedic medicine) పంపిణీ చేస్తామని చెప్పిన ఆనందయ్య.. అప్పటివరకు ఆ పుకార్లను నమ్మవద్దన్నారు. అనుమతి వచ్చిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆనందయ్య స్పష్టంచేశారు.
ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషధంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకముందే వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఆనందయ్య (Anandayya Ayurvedic medicine latest news) ఈ ప్రకటన విడుదల చేశారు.
Also read: Ayush Report: కృష్ణపట్నం మందుతో ఎలాంటి ప్రమాదం లేదు, ముఖ్యమంత్రి చేతికి నివేదిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook