Perni Nani: రేషన్ బియ్యం మాయమైన కేసులో ఏపీ పోలీసులు మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ సహా మరి కొందరిపై కేసులు నమోదు చేశారు. తాజాగా పేర్ని నానిని కూడా కేసులో చేర్చిన పోలీసులు ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే క్రమంలో ఏపీ హైకోర్టు నుంచి ఉపశమనం లబించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుద్ధను ఏ1గా పెట్టి కేసు నమోదు చేసిన పోలీసులు ఏ6గా పేర్ని నానిని చేర్చారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశముండటంతో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు అప్పుడే ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించడమే కాకుండా కౌంటర్ పిటీషన్ దాఖలు చేయాలని పోలీసులను కోరింది. సోమవారానికి కేసు వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకూ పేర్ని నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
ఇప్పటికే ఇదే కేసులో పేర్ని నాని భార్య జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ2గా గోడౌన్ మేనేజర్ మానస తేజ ఉన్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా యంత్రాంగం ఈ కేసులో రికవరీ కింద పేర్ని నాని కుటుంబం నుంచి కోటి 68 లక్షలు వసూలు చేసింది. మరో కోటి 67 లక్షలు చెల్లించాలని మళ్లీ నోటీసులు పంపించారు.
Also read: Mid Day Meals: ఏపీలో మరో పధకం, రేపట్నించి ఇంటర్ విద్యార్ధులకు సైతం మిడ్ డే మీల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.