BIG BOSS : బిగ్ బాస్ షో నిలిచిపోనుందా? అశ్లీలతపై ఏపీ హైకోర్టు సీరియస్..

BIG BOSS :  బిగ్ బాస్.. దేశంలోని పాపులర్ రియాల్టీ షోలలో ఒకటి. హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు బాషల్లోనూ సూపర్ సక్సెస్ అయింది. బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయిందో దాని చుట్టూ  విమర్శలు అదే రేంజ్ లో ఉంటాయి

Written by - Srisailam | Last Updated : Sep 30, 2022, 02:56 PM IST
  • చిక్కుల్లో బిగ్ బాస్ షో
  • బ్యాన్ చేయాలని పిల్
  • హైకోర్టులో హాట్ కామెంట్స్
 BIG BOSS : బిగ్ బాస్ షో నిలిచిపోనుందా? అశ్లీలతపై ఏపీ హైకోర్టు సీరియస్..

BIG BOSS :  బిగ్ బాస్.. దేశంలోని పాపులర్ రియాల్టీ షోలలో ఒకటి. హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు బాషల్లోనూ సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాగ్ షో ఆరవ సీజన్ నడుస్తోంది. టాలీవుడ్ టాప్ స్టార్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోలతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు కంటెస్టెంట్స్. సినిమాల్లోనూ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు.  అయితే బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయిందో దాని చుట్టూ  విమర్శలు అదే రేంజ్ లో ఉంటాయి. బిగ్ బాగ్ హౌజ్ అశ్లీలత పెరిగిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులతో  రోత పుట్టిస్తున్నారని, బూతులు మాట్లాడుకుంటూ చిల్లరగా వ్యవహరిస్తున్నారని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవలే బిగ్ బాస్ హౌజ్ ను ఏకంగా బ్రోతల్ హౌస్ తో పోల్చారు నారాయణ. బిగ్ బాస్ షోపై తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.బిగ్ బాస్ షో ఆపేయాలంటూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.  బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువైందని.. వెంటనే షోను ఆపేయాల్సిందిగా ఆదేశించాలని తన పిటిషన్ లో ఆయన అభ్యర్థించారు. అశ్లీలత ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి చూడలేకపోతున్నామని తెప్పారు. శివప్రసాద్ రెడ్డి పిటిషన్ పై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

పిటిషన్ తరపున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఐబీఎఫ్ గైడ్ లైన్స్  ను బిగ్ బాస్ షో నిర్వాహకులు పాటించలేదని ఆరోపించారు. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందన్నారు.విచారణ సందర్భంగా బిగ్ బాస్ షోపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 1970 లలో వచ్చిన సినిమాల విషయాన్ని ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేసింది. ఈ కేసులో కేంద్రం తరపు న్యాయవాది తన స్పందనకు కొంత సమయం కోరారు. దీంతో  ప్రతివాదులకు నోటీసుల విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది.

Read also: మింగుతా, సింగుతా అంటూ దారితప్పుతోన్న జబర్దస్త్.. డబుల్ మీనింగ్ డైలాగ్‌తో సింగర్ మనో

Read also: AP Govt: నిరుద్యోగులకు శుభవార్త..కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News