Judges Trolling: చంద్రబాబు అరెస్టు అనంతరం ఆయన పిటీషన్లను విచారించిన న్యాయమూర్తులపై సోషల్ మీడియా సాక్షిగా ఉద్దేశ్యపూర్వకంగా ట్రోలింగ్ జరిగింది. న్యాయమూర్తులపై కొందరు దూషణలకు దిగారు. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది.
ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, కుటుంబసభ్యుల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వర్గం దూషణలకు దిగడమే కాకుండా ట్రోలింగ్ చేపట్టింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తులపై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన 26మందికి నోటీసులు జారీ అయ్యాయి. న్యాయమూర్తులపై దూషణల విషయంలో రాష్ట్రపతి కార్యాలయం కూడా సీరియస్ అయింది.
సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత న్యాయమూర్తులపై ట్రోలింగ్ ప్రారంభమైంది. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ మాధ్యమాల్లో అసభ్యకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ క్యాంపెయిన్ నడిచింది. ముఖ్యంగా టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎక్కౌంట్లతో సహా 26 మందిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఏపీ హైకోర్టు డీజీపీకు ఆదేశించింది. అదే విధంగా ప్రతివాదులుగా ఉన్న గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు సైతం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.
చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఓ వర్గం సోషల్ మీడియాలో రెచ్చిపోయిందని అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టులో వాదనలు విన్పించారు. న్యాయమూర్తులతో పాటు వారి కుటుంబసభ్యులపై కూడా ట్రోలింగ్ జరిగిందని వివరించారు. మొత్తం 26 మందిపై నోటీసులకు ఆదేశించిన హైకోర్టు విచారణను 4 వారాలు వాయిదా వేసింది.
Also read: AP High Court: ఉండవిల్లి పిటీషన్లో నాట్ బిఫోర్ మి అంశం, మరో బెంచ్‌కు బదిలీ కేసు విచారణ వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook