AP High Court: చంద్రబాబు క్వాష్ పిటీషన్ ఏం కానుంది, తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

AP High Court: ఏపీ స్కిల్ డెవలప్‌‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు, సీఐడీ తరపు న్యాయవాదుల మద్య తీవ్రమైన వాదనలు జరిగాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 19, 2023, 08:29 PM IST
AP High Court: చంద్రబాబు క్వాష్ పిటీషన్ ఏం కానుంది, తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

AP High Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై హోరాహోరీ వాదనల అనంతరం ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఎలా వస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

చంద్రబాబు రిమాండ్ కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై పెద్దఎత్తున వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్ధ్ లూథ్రాలు వాదనలు విన్పించగా, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. 

చంద్రబాబు తరపు వాదనలు ఇలా

చంద్రబాబు అరెస్టులో సీఐడీ సరైన నియమావళి పాటించలేదని, గవర్నర్ అనుమతి తీసుకోలేదని తెలిపారు. ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17 ఏ ప్రకారం అరెస్టు జరిగినప్పుడు గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. 2020లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీకారం కోసం ఇదంతా చేశారని వాదించారు. ఎక్కడా సాక్ష్యాల్ని తారుమారు చేయలేదని వివరించారు. ఈ సందర్భంగా అర్నబ్ గోస్వామి కేసులో కోర్టు తీర్పును ప్రస్తావించారు. 

సీఐడీ వాదనలు ఇలా

సీఐడీ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణకు అనర్హమని కొట్టివేయాలని కోరారు. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే చంద్రబాబుని అరెస్టు చేయలేదని, కేసు నమోదైన రెండేళ్లవరకూ సాక్ష్యాధారాలు సేకరించి అప్పుడు అరెస్టు చేశారని చెప్పారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్చనిస్తూ క్వాష్ పిటీషన్ కొట్టివేయాలని కోరారు. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లైనా వేయవచ్చన్నారు. ఎంతమంది సాక్షులనైనా కేసులో చేర్చవచ్చన్నారు. 371 కోట్లు ఎక్కడికి వెళ్లాయనేది నిగ్గు తేల్చాలని, ఈ కేసులో షెల్ కంపెనీల జాడ బయటకు తీస్తున్నామన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిదుల దుర్వినియోగం జరిగినట్టు చెప్పారు. 

ఇరు పక్షాల వాదనలు హోరాహోరీగా సాగాయి. వాదనలు పూర్తిగా విన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వాదనలు ముగిశాయని ప్రకటించారు. తీర్పు రిజర్వ్ చేశారు. రేపు లేదా ఎల్లుండి చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై తీర్పు వెలువడనుంది. 

Also read: Janasena Glass Symbol: జనసేనకు గుడ్‌న్యూస్.. గాజు గ్లాస్ గుర్తు వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News