AP High Court: కృష్ణపట్నం కరోనా మందు వ్యవహారం ఇప్పుడు ఏపీ హైకోర్టుకు చేరింది. ఆనందయ్య మందు విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కృష్ణపట్నం (Krishnapatnam Medicine)ఆనందయ్య మందు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కోవిడ్ మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మరోవైపు ఆనందయ్య మందును ఆయుర్వేద మందుగా గుర్తించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించాలని మరో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్లను అత్యవసరంగా విచారణ జరపాలని పిటీషనర్లు కోరడంతో హైకోర్టు (Ap High Court) విచారణ ప్రారంభించింది.
ఆనందయ్య మందు(Anandaiah Medicine)పై పరీక్షలు జరుపుతున్నామని ఏపీ ప్రభుత్వం (Ap government) హైకోర్టుకు తెలిపింది. ల్యాబ్‌ల నుంచి ఈ నెల 29న రిపోర్టులు వస్తాయని వెల్లడించింది. ఆనందయ్య మందు కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని..వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు సూచించింది. కృష్ణపట్నం కరోనా మందు వల్ల ఇబ్బందుల్లేవని తేలితే కేంద్ర ఆయుష్ శాఖ అనుమతిస్తుందని కేంద్రం చెప్పినట్టు హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో ఆనందయ్య మందుపై అనుమతి ఎవరివ్వాలి, మందుపై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయమేంటనేది వెంటనే కోర్టుకు చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.
Also read: AP High Court: కృష్ణపట్నం కరోనా మందుపై రేపు హైకోర్టులో విచారణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook