AP Inter Results 2023: 2023 ఏప్రిల్ నెలలో విడుదలైన ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పిన విద్యార్ధుల కోసం నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ఫలితాలు వెల్లడి కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీలో మార్చ్ 2023లో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కాగా రికార్డు స్థాయిలో ఏప్రిల్ నెలలోనే ఫలితాలు విడుదల చేశారు అధికారులు. ఆ తరువాత ఇంటర్మీడియట్ పరీక్ష తప్పిన విద్యార్ధుల కోసం ఏడాది వృధా కాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం వెనువెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించింది. మే 24 నుంచి జూన్ 1 వరకూ జరిగిన సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం పూర్తి కావడంతో రేపు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఏపీ ఇంటర్మీడియట్ ప్రధమ, రెండవ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్ని రేపు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల్ని విద్యార్ధులు https://resultsbie.ap.gov.in/ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు.
Also read: TS High Court: జగన్ కేసుపై పిల్, చేగొండి హరిరామ జోగయ్యకు హైకోర్టు అక్షింతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook