నెల్లూరు: జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లామ్‌లో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రజలతో మాట్లాడుతున్న సమయంలోనే స్టేజ్‌పై నుంచి ఆయన కుర్చీ కాస్త కిందకి ఒరిగింది. అది గమనించిన వైఎస్సార్సీపీ నేతలు వెంటనే అప్రమత్తమై మంత్రి కింద పడకుండా ఒడిసి పట్టుకున్నారు. చుట్టూ ఉన్న నేతలు అప్రమత్తంగా ఉండటంతో మంత్రికి ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది.