AP: ప్రజాభిప్రాయం అనంతరమే నూతన ఇసుక విధానం ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇసుక విధానంపై దృష్టి సారించారు. ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతి ఉండకూడదని ..ధర ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

Last Updated : Oct 19, 2020, 04:58 PM IST
AP: ప్రజాభిప్రాయం అనంతరమే నూతన ఇసుక విధానం ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఇసుక విధానం ( Sand policy ) పై దృష్టి సారించారు. ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతి ఉండకూడదని ..ధర ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

ప్రతి ప్రభుత్వంలో ఉన్నట్టే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ( Ycp Government ) లో కూడా ఇసుక పెద్ద సమస్యగా మారింది. ఎన్ని మార్గదర్శకాలు జారీ చేస్తున్నా సరే అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి దృష్టి పెట్టారు. క్యాంప్ కార్యాలయంలో నూతన ఇసుక విధానంపై సమీక్ష నిర్వహించారు. అధికార్లకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో, పూర్తి పారదర్శక విధానం ఉండాలని చెప్పారు. అదే విధంగా ఇసుక సరఫరాలో సామర్ధ్యం పెంచాలని, నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలని సూచించారు. ఇసుక రీచ్‌ల సామర్థ్యం పెరిగితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని, వీలుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వస్తుందని సీఎం అంచనా వేశారు. 

చలాన్ కట్టి ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా ఉండాలని.. ధర ఎంత ఉండాలనేది స్థానిక నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ణారణ చేయాలన్నారు. నిర్ధారిత ధర కంటే ఎక్కువ రేటుకు అమ్మితే..ఎస్ఈబీ రంగ ప్రవేశం చేస్తుందని హెచ్చరించారు. ఎవరికి వారు రీచ్‌కు వచ్చి కావాల్సిన ఇసుక తీసుకుపోయే విధంగా తగిన సదుపాయాలు కల్పించాలని.. కాంట్రాక్టర్‌ స్టాండ్‌ బై రవాణా సదుపాయం కల్పించాలని చెప్పారు. 

ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల ఇళ్లకు సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలని.. టోకెన్లు ఇచ్చి ఇసుక సరఫరా చేయవచ్చని సూచించారు.. స్థానికంగా ఉంటున్నవారికి ఇసుక అవసరమైతే,  కూపన్లు ఇచ్చి, సబ్సిడీ ధరకు ఇసుక సరఫరా చేయొచ్చని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎన్ని కిలోమీటర్ల పరిధిలో గ్రామాలకు ఇసుక సరఫరా చేయాలనేది పరిశీలించనున్నారు. 

అయితే నూతన ఇసుక విధానం ఖరారు చేయడానికి ముందు పత్రికా ముఖంగా ప్రకటన ఇచ్చి ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించాలని మంత్రుల్ని ఆదేశించారు వైఎస్ జగన్. Also read: Cm jagan letter Row: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానాన్ని స్వయంగా అధ్యక్షుడే వ్యతిరేకించారా

Trending News