AP: రికార్డు స్థాయిలో 25 లక్షల పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ( Corona cases )ఉధృతి ఆగడం లేదు. ప్రతిరోజూ సరాసరి పదివేల కేసులు నమోదవుతున్నాయి. అటు కరోనా నిర్ధారణ పరీక్షల ( Covid 19 tests ) సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో దాదాపు 11 వేల కేసులు నమోదయ్యాయి. 

Last Updated : Aug 9, 2020, 10:34 PM IST
AP: రికార్డు స్థాయిలో 25 లక్షల పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ( Corona cases )ఉధృతి ఆగడం లేదు. ప్రతిరోజూ సరాసరి పదివేల కేసులు నమోదవుతున్నాయి. అటు కరోనా నిర్ధారణ పరీక్షల ( Covid 19 tests ) సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో దాదాపు 11 వేల కేసులు నమోదయ్యాయి. 

కరోనా వైరస్ మహమ్మారి ( Corona virus pandemic ) దేశమంతటా ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 62 వేల 912 పరీక్షలు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో 10 వేల 820 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 27 వేల 860 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే లక్షా 38 వేల 712 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 9 వేల 97 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87 వేల 712 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా 97 మంది మృతి చెందగా..మొత్తం 2 వేల 36కు చేరుకుంది ఆ సంఖ్య. ఇక పరీక్షల పరంగా చూస్తే రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా 24 లక్షల 87 వేల 305 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. Also read: విశాఖ పోర్టు ట్రస్టులో అగ్నిప్రమాదం

Trending News