Ap government on Union Budget 2021: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ అధికార పార్టీ అసంతృప్తి

Ap government on Union Budget 2021: కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఏపీకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపించింది. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని..సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు అధికార పార్టీ ఎంపీలు.

Last Updated : Feb 1, 2021, 04:59 PM IST
Ap government on Union Budget 2021: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ అధికార పార్టీ అసంతృప్తి

Ap government on Union Budget 2021: కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఏపీకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపించింది. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని..సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు అధికార పార్టీ ఎంపీలు. 

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Union Finance minister Nirmala Sitaraman ) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ స్పందించింది. బడ్జెట్‌లో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని..ఇది సమాఖ్య స్ఫూర్తిగా వ్యతిరేకంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr congress party Mps ) ఎంపీలు విమర్శించారు. బడ్జెట్ ( Union Budget )‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బడ్జెట్‌ పూర్తిగా‌ నిరాశపరిచిందని, ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదని స్పష్టం చేశారు.  రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం (Central Government ) సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విజయసాయి రెడ్డి ( Vijaya sai reddy ) తెలిపారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారని మండిపడ్డారు. ఏపీకి ఏమాత్రం నిధులు కేటాయించలేదని, రాష్ట్రానికి ఆత్మనిర్భర్ కూడా కనపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ( Ap Special status ) విషయంలో కేంద్ర ప్రభుత్వ శ్రద్ధ ఏమాత్రం కనిపించలేదని విమర్శించారు.   

ఏపీలో మెట్రో రైలు ( Metro Rail ) కోసం కేంద్రాన్ని ఆరేళ్లుగా కోరుతున్నా..పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేశారు. కొత్త టెక్స్‌టైల్‌ పార్క్‌ కావాలని కోరినా..బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదన్నారు. పోలవరం సవరించిన అంచనాలపై బడ్జెట్‌లో అసలు ప్రస్తావనే లేదని..ప్రైవేట్ కారిడార్ల వల్ల పెద్దగా ఉపయోగం లేదని తెలిపారు.  రాష్ట్రానికి ఎక్కువ కిసాన్ రైళ్లను వేయాలని కోరినా..నిర్లక్ష్యం వహించారన్నారు. నేషనల్ వైరాలజీ సెంటర్ ( National Virology centre ) ‌ను ఆంధ్రప్రదేశ్ Andhra pradesh )‌లో ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. 

కేంద్ర బడ్జెట్ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ( Pilli Subhash chandra bose ) వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రానికి 20 వేల కోట్ల రెవిన్యూ లోటు ఉందని చెప్పారు. 

Also read: Nimmagadda Ramesh Kumar: Voter ID కోసం ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తంటాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News